నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ గిరిజన మహిళపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన ఓ మహిళ తన భర్తతతో కలిసి శుక్రవారం రాత్రి పక్క వూరికి వెళ్లింది.

అక్కడ ఏదో మాట మీద భర్త ఆమెతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన వివాహిత స్వగ్రామానికి అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తోంది. ఈ క్రమంలో పక్క గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మార్గమధ్యంలో ఆమెను అడ్డగించి అత్యాచారం చేసి పారిపోయారు.

శనివారం బాధితురాలు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారానికి పాల్పడింది కురుగొండ్ల నరసయ్య, సక్కిరాల రవి, బండ్ల కామాక్షయ్యలుగా గుర్తించారు.