సిద్దిపేట కాల్పుల కేసులో సంచలనం... ఆ ఏకే-47 పోలీసులదేనా...?

సిద్దిపేటలో కలకలం సృష్టించిన ఏకె‌-47 తుపాకీతో కాల్పుల ఘటనలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.

Man fires with AK 47 rifle in Siddipet

సిద్ధిపేటలో కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో సంచలన విషయాలు బైటపడ్డాయి. ఈ కాల్పుల కోసం నిందితుడు ఉపయోగించిన ఏకె-47 రెండేళ్ల క్రితం హుస్నాబాద్‌ పోలీసు స్టేషన్‌ నుంచి మాయమైనదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. 

హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం కేంద్రంలో... ఓ చిన్న గొడవ తుపాకీతో కాల్చుకునేదాకా దారితీసింది. ఏకే 47తో రెండు రౌండ్లు కాల్పులు జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గుంటి గంగా రాజు అనే వ్యక్తిపై దేవుని సదానందం అనే వ్యక్తి ఈ కాల్పులు జరిపాడు. మిస్ ఫైర్ కావడంతో గంగరాజుకు ప్రాణాపాయం తప్పింది.

read more  సిద్ధిపేటలో కాల్పుల కలకలం.. ఏకే47 తుపాకీతో కాల్చి...
 
అయితే ఈ కాల్పులకు కారణమైన నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అతడు అందించిన సమాచారం మేరకు సిద్దిపేట, హుస్నాబాద్ ఏసీపీలు, క్లూస్ టీం సహాయంతో సదానందం ఇంటిని తనిఖీ చేశారు. పేలిన తూటాలతో పాటు ఏకె-47 ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే తల్వార్ కత్తి, తుపాకి బెల్ట్, బాడిషా కత్తి, రెండు ఫోన్లు, రెండు బ్యాంక్ అకౌంట్ల ఏటీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

అయితే కొద్దిరోజుల క్రితం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఏకే-47, కార్బన్‌ తుపాకులు మాయమయ్యాయి. సదానందం ఇంట్లో దొరికిన తుపాకీ బెల్టుపై 'ఏపీపీ' అని ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పోలీస్ ఆయుధాలపై మాత్రమే  వుంటుంది. దీంతో ఇది హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుండి కొట్టేసిప తుపాకీగానే పోలీసులు భావిస్తున్నారు.

గతంలో ఓ కేసు విషయమై  సదానందం తరచూ హుస్నాబాద్‌ ఠాణాకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే అతడు ఈ తుపాకీని దొంగిలించి వుంటాడని అనుమానిస్తున్నారు. నిందితుడు నుండి అసలు నిజాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెళ్లడిస్తామని పోలీసులు తెలిపారు. 
 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios