కర్నూల్: దీపావళి పండుగ సంధర్బంగా జిల్లా ప్రజలకు ఎస్పీ ఫక్కీరప్ప శుభాకాంక్షలను తెలిపారు. ఎంతో పవిత్రమైన ఈ పండగను ప్రజలందరు సంతోషకరంగా జరుపుకోవాలన్నారు.దీపావళి సంబరాలలో భాగంగా  టపాసులు కాల్చే విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు వారితో పాటే వుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే డయల్ 100కు లేదా స్ధానిక పోలీసులకు గాని సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. 

దీపావళి పండుగ పూర్తయిన తర్వాత మిగిలిన బాణా సంచాను దుకాణాదారులు దాచుకోకుండా ఎక్కడ కోనుగోలు చేశారో అక్కడ వాటిని తిరిగి ఇచ్చేయాలన్నారు. ఎవరు కూడా మందుగుండు సామాగ్రిని అనధికారికంగా నిల్వచేయడం, విక్రయించడం వంటివి చేయకూడదన్నారు.  బాణా సంచా అక్రమ నిల్వలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

read more రాష్ట్రం తర్వాత... ముందు నీ ఇంటి సమీపంలో పర్యటించు..: జగన్ పై ఉమ కౌంటర్

జిల్లా మంత్రులు, కలెక్టర్  కూడా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరంకలిసి పర్యావరణ హిత దీపావళి జరుపుకుని ఇంటింటా ఆనందాల వెలుగులు నింపుదామని పిలుపునిచ్చారు. వెలుగుల పండుగ దీపావళి జిల్లా ప్రజల జీవితాల్లో వేల కాంతులు నింపాలని... ప్రతిఒక్కరు పర్యావరణ హిత దీపావళిని జరుపుకుందాని అన్నారు.

కర్నూల్ జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మన జయరాం, శాసనమండలి ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డితొ పాటు జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జెసి రవి పట్టన్ షెట్టి, జెసి2 సయ్యద్ ఖాజా మెహిద్దీన్ లు ఈ శుభాకాంక్షలను తెలిపినవారిలో వున్నారు.

read more   వల్లభనేని వంశీపై చంద్రబాబు ఆగ్రహం: తడాఖా చూపాలని దేవినేని ఉమకు ఆదేశం

చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా ఇంటింటా జరుపుకుంటున్న దీపావళి  పండుగ జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగజేయాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.