కర్నూలు జిల్లా నంద్యాలలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో తిరుపతికి చెందిన సోమశేఖర్ రెడ్డి, సురేంద్ర నాయుడు అనే వ్యక్తులపై కత్తితో దాడి చేశారు. నంద్యాలకు చెందిన గంగు ఆనంద్ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు అని డబ్బులు విషయం ఆడిగేందుకు వెళ్లిన వారిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది.

కత్తిపోట్లకు గురైన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు కు తరలించారు. దాడికి పాల్పడిన గంగు ఆనంద్ పరారీలో ఉన్నట్లు సమాచారం.. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా నంద్యాల CSI చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్ లో 2017 సంవత్సరం లో సెక్రెటరీ గా ఉన్నప్పుడు గంగు ఆనంద్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు.

also read:రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. మూడు కేజీల బంగారం చోరీ

తిరుపతి, జమ్మలమడుగు మరియు ఇతర ప్రాంతాలకు చెందిన 15 మంది వద్ద లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ డబ్బులు విషయం బాధితులు అడిగేందుకు నంద్యాల లోని గంగు ఆనంద్ ఇంటి వద్దకు వెళ్లిన సమయంలో వారిపై కత్తితో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడిలో గాయపడిన వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి దాడికి పాల్పడిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు.