హైదరాబాద్: సికింద్రాబాద్ వెళ్లే  మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లో మంగళవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు.సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు సూఫర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు భద్రాచలం రైల్వేస్టేషన్ లో నిలిచిన సమయంలో ఎ1, బి1 ఏసీ బోగీల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. 

ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణీకులు బోగీ నుండి వెంటనే కిందకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా రైల్వేస్టేషన్ లో దట్టమైన పొగ అలుముకొంది. ఈ బోగీల్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు.