హైదరాబాద్ మెట్రోలో ఓ మందుబాబు చిందులు వేశాడు. కాగా... ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తాగిన మత్తులో విపరీతంగా డ్యాన్సులు వేస్తూ... మెట్రోలో ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశాడు. డ్యాన్స్ లు వేయడంతోపాటు... సెల్ఫీలు తీసుకుంటూ... తోటి ప్రయాణికులను ఫోటోలు తీసుకుంటూ నానా హంగామా చేశాడు.

అతని హంగామా తట్టుకోలేక అతనిని మెట్రో దిగాల్సిందిగా బలవంతం చేశారు. దీంతో చేసేది లేక అతను తర్నాకలో దిగిపోయాడు. ఈ నెల 8వ తేదీ చోటుచేసుకోగా.... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరైన తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో మంద్యం సేవించినవారు మెట్రో ఎక్కి నానా హంగామా చేసి తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.

దీనిపై మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఇలాంటి వాటిపై ప్రయాణికులు తక్షణ ఫిర్యాదు చేసేందుకు త్వరలో వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆ మద్యం సేవించిన వ్యక్తి ఎవరూ అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.  కాగా... ఆ వ్యక్తి తాగిన మైకంలో చేసిన హంగామాను ఓ వ్యక్తి వీడియో తీయగా..సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.