ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. కొండపైయున్న లాడ్జిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌కు చెందిన పవన్, ధనలక్ష్మీ దంపతులు.. పవన్ నగరంలో ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం అన్నవరం వచ్చిన ఈ జంట ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆర్ధిక సమస్యలతోనే దంపతులు బలవన్మరణానికి పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం.