అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో తెలుగు దేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ  ప్రారంభోత్సవం రోజే చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్‌పి సమావేశం కూడా జరిగింది. ఈ  సందర్భంగా పార్టీ  భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిగింది. 

చర్చించిన అంశాలివే:

''1). స్వల్ప వ్యవధిలో ఆహ్వానాలు అందినా పెద్దఎత్తున కార్యకర్తలు టిడిపి జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహం, పార్టీ పట్ల సానుకూలత దీనినిబట్టే వ్యక్తం అయ్యాయి.9జిల్లాల్లో 123నియోజకవర్గాల సమీక్షలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రతి నియోజకవర్గంపై 2గంటలు సమీక్షించాం. 

కేసులు పెట్టినా, బిల్లులు పెండింగ్ పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేసినా కార్యకర్తల్లో పట్టుదల మరింత పెరిగిందే కాని, సడలలేదు. టిడిపి 4సార్లు ఓటమి పాలైనా గతంలో నెమ్మదిగా కార్యకర్తల్లో నైతిక సామర్ధ్యం బిల్డప్ అయ్యేది. కానీ గత ఓటముల తర్వాత రానంత పట్టుదల, ఉత్సాహం ఈ ఓటమి అనంతరం ఐదారు నెలల్లోనే కార్యకర్తల్లో చూస్తున్నాం.
 కార్యకర్తలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. పార్టీలో ప్రతి నేత వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉంది.

read more  DishaCaseAccusedEncounter : మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలు

2) ఇది శాసన సభ 3వ సెషన్. మొదటిది ప్రమాణ స్వీకారాలు, రెండవది బడ్జెట్ సమావేశాలు, ఇప్పుడీ శీతాకాల సమావేశాలు మూడవది. ఏదో మొక్కుబడిగా కేవలం 7రోజుల్లో ముగించాలని వైసిపి ప్రభుత్వం చూడటం కరెక్ట్ కాదు.‘‘మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్నిరోజులు నడుపుతాం, మీరెన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు చర్చిద్దాం’’ అని గతంలో అన్న పెద్దమనిషి(జగన్మోహన్ రెడ్డి) ఇప్పుడీ రకంగా మొక్కుబడి సమావేశాల నిర్వహణలోనే వైసిపి డొల్లతనం బైటపడుతోంది.

మొదటి 2సెషన్స్ ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాం. 6నెలలు సమయం ఇద్దామని మొదట్లో అనుకున్నాం. కానీ ఈ 6నెలల్లోనే అన్నివర్గాల ప్రజలను నానారకాల బాధలు పెట్టడం, అనేక ఇబ్బందుల పాలు చేశారు. ఈ సమావేశాల్లోనే వాటన్నింటినీ నిలదీయాలి. జనం బాధలు  సభలో వినిపించాలి. 6నెలల వైసిపి వైఫల్యాలను సభలో ఎండగట్టాలి.

read more దిశ నిందితుల ఎన్కౌంటర్... మంత్రిగా కాదు ఆడపిల్ల తండ్రిగా చెప్పేదిదే: మంత్రి అవంతి

వేసిన ప్రశ్నలపై ప్రతి సభ్యుడు సమాచారం స్టడీ చేయాలి. ప్రశ్నోత్తరాల సమయం సద్వినియోగం చేసుకోవాలి. ప్రశ్నలు, షార్ట్ డిస్కషన్, వాయిదా తీర్మానాలపై సమగ్ర చర్చ జరిగేలా చూడాలి.

3).ఉల్లి మరియు నిత్యావసర ధరల పెరుగుదల, టిడిపి కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు, దౌర్జన్యాలు, నదుల అనుసందానం, విభజన చట్టంలో అంశాల అమలు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, రైతు రుణమాఫీ 4,5 విడతలు ఎగ్గొట్టడం, గ్రామ సచివాలయాల పోస్ట్ లు, వాలంటీర్ల నియామకాల్లో అక్రమాలు అమ్ముకోడాలపై సభలో ప్రశ్నలు లేవనెత్తనున్నట్లు తెలిపారు.

అలాగే విద్యుత్ కోతలు, నరేగా బిల్లుల పెండింగ్, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు-ఆత్మహత్యాయత్నాలు, హౌసింగ్ పనులు నిలిచిపోవడం-బిల్లుల పెండింగ్, బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకాలు, రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం-దుబారా ఖర్చులు- సలహాదారులకు లక్షల్లో వేతనాలు, పెట్టుబడులు వెనక్కి పోవడం-రాజధాని పనుల నిలిపివేత, 6నెలల్లో సంక్షేమ పథకాల్లో కోతలు- గత ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్ ల రద్దులు, అన్నిజిల్లాల్లో నిలిచిపోయిన అభివృద్ది పనులు, జీవో 2430ద్వారా మీడియాపై ఆంక్షలు తదితర 21 అంశాలపై ఈ శీతాకాల సమావేశాల్లో సమగ్ర చర్చ జరిగేలా చూడాలి'' అని టిడిఎల్పి సమావేశం నిర్ణయించినట్లు వెల్లడించారు.