విశాఖపట్నం: ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి సిఐ సత్యనారాయణ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖపట్నంలో నగరంలోని ప్రహ్లాదపురం ప్రాంతంలో పక్కపక్కనే బాలుడు, బాలిక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

ఈ నెల 4వ తేదీన ట్యూషన్ కు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరలేదు. దాంతో తల్లిదండ్రులు ఆమె కోసం గాలించారు. అయితే, అనుమానం వచ్చి పక్కింట్లో చూశారు. ఆ సమయంలో బాలుడు, బాలిక ఇరువురు ఇంట్లో కనిపించారు. 

బాలుడి తల్లిదండ్రులు ఆ సమయంలో ఇంట్లో లేరు. తమ కూతురిపై బాలుడు అత్యాచారం చేసినట్లు వారు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్ కు తరలిం్చారు.