నిర్మల్ జిల్లాలో క్రికెట్ ఆట ఓ బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొంది. కుంటాల మండలం రాజాపూర్‌లో క్రికెట్ ఆడుతుండగా జరిగిన చిన్న గొడవ హత్యకు దారి తీసింది. సతీష్ అనే బాలుడు ఆదివారం సాయంత్రం స్నేహితులతో  కలిసి క్రికెట్ ఆడుతుండగా వివాదం చోటు చేసుకుంది.

క్షణికావేశంలో ఆ బాలుడిని తోటి మిత్రులు రాయితో కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భయంతో మృతదేహాన్ని మొక్క జోన్న చేనులో పడేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

తల పూర్తిగా నుజ్జునుజ్జుగా మారిపోవడంతో డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ సాయంతో ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య వెనుక ఎవైనా పాత గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

Also Read:

అవనిగడ్డ బాలుడి హత్య కేసులో వీడిన మిస్టరీ

బాలుడి హత్య: తల్లిపై అనుమానాలు, అక్రమ సంబంధం బయటపడుతుందని...?