కృష్ణా జిల్లా అవనిగడ్డ లో మంగళవారం మూడో తరగతి బాలుడు దాసరి ఆదిత్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. బాలుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. పదో తరగతి విద్యార్థే... ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గురర్తించారు. సోమవారం ఆదిత్యకు... పదో తరగతి విద్యార్థికి మధ్య గొడవ జరగడమే ఈ హత్యకు కారణం అని తెలిసింది.

బాలుడి హత్యకు ఉపయోగించిన పెన్సిల్‌ చెక్కే బ్లేడ్‌తో పాటు రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య తన మాట వినడం లేదనే కోపంతో నిందితుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

పదో తరగతి విద్యార్థి సోమవారం రాత్రి ఆదిత్యను బాత్రూమ్‌కు తోడు తీసుకు వెళ్లి అనంతరం బ్లేడ్‌తో గొంతు కోశాడు. గుంటూరు జిల్లాకు చెందిన నిందితుడు, ఆదిత్య  కొన్నిరోజులు కలసి  పడుకున్నారు. అయితే అతడి వికృత చేష్టలకు భయపడి ఆదిత్య అతడి దగ్గర పడుకోవడం మానేసినట్టు తెలిసింది. 

దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.  ఇక నిందితుడితో పాటు హాస్టల్‌ వార్డెన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఇన్‌చార్జి వసతి గృహ అధికారి పీవీ నాగరాజు, వాచ్‌మన్‌ నాగబాబుని  జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ సస్పెండ్‌ చేశారు.