అనంతపురం : రాజధాని విషయంలో పోరు తీవ్రతరం చేసేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. ఇప్పటికే రాయలసీమ హక్కుల కోసం పోరాడతానని స్పష్టం చేసిన టీజీ వెంకటేష్ తాజాగా జగన్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

రాజధాని విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. 

రాయలసీమను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదుకోవాలని కోరారు. రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిని ఫ్రీజోన్‌గా ఏర్పాటు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ జరగాలని టీజీ వెంకటేష్ కోరారు.