ఆదిలాబాద్: కేంద్ర  ప్రభుత్వం అందించే నిధులను ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఖర్చు చేస్తూ తిరిగి కేంద్ర ప్రభుత్వంపైనే తెలంగాణ సీఎం కేసీఆర్ బురద జల్లుతున్నారని బిజెపి ఎంపి సోయం బాపురావు ఆరోపించారు. కేంద్రం నిధులివ్వడం ఆపేస్తే ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రెండు రోజుల పాలన కూడా చేయలేదని అన్నారు.  

రాష్ట్ర ప్రజల ముందు కేంద్ర ప్రభుత్వం, బిజెపిపై విమర్శలు చేస్తున్న కేసీఆర్ డిల్లీకి వెళితే ప్రధాని, హోంమంత్రి ల కాళ్లు  మొక్కుతారని అన్నారు. ఇలా రెండు విధాల ప్రవర్తనను కలిగిన కేసీఆర్ కు దూరంగా వుండాలని ప్రధాని మోదీని కలిసినప్పుడు చెప్పానన్నారు. కనీసం ఆయనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వోద్దని చెప్పానని ఎంపీ తెలిపారు. 

గత పార్లమెంట్ ఎన్నికల్లో  వచ్చిన ఫలితమే మున్సిపల్ ఎన్నకల్లో కూడా పునరావృతం అవుతుందని... టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయ పార్టీ బిజెపియే అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితం సాధిస్తామన్న నమ్మకం వుందన్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమవ్వాల్సి వస్తుందని... బిజెపి కార్యకర్తలు  పార్టీని పటిష్టం చేయడానికి మరింత కష్టపడాలని సూచించారు. 

Year Roundup 2019: కరీంనగర్ లో కారు స్పీడుకు బ్రేకులేసిన కాషాయ పార్టీ... మరిన్ని

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల మొదటివారంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అయితే ఆయన ఎన్నివిధాలుగా ప్రయత్నించినా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ మాత్రం దక్కలేదు. 

ఈ నెల 3వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ న్యూఢిల్లీకి వెళ్లారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మెన్ రాజీవ్ శర్మ కొడుకు పెళ్లి రిసెప్షన్ లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. మరో మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండాలని భావించారు. ఈ మూడు రోజుల్లో ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ లభిస్తే ఆయనను కలవాలని భావించారు. 

CAB 2019: వారే కేంద్రాన్ని అలర్ట్ చేశారు: సిహెచ్ విద్యాసాగర్ రావు

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుండి మాత్రం సానుకూలమైన స్పందన రాలేదు.  ప్రధాన మంత్రి మోడీ కేబినెట్ సమావేశాలతో బిజీగా ఉన్నాడని ప్రదానమంత్రి కార్యాలయం నుండి తెలంగాణ సీఎం‌ కేసీఆర్‌కు సమాచారం వచ్చిందని  సమాచారం. దీంతో తన పర్యటనను అర్థాంతరంగా  ముగించుకుని కేసీఆర్ తిరిగివచ్చారు.