స్థానికసంస్థల ఎన్నికలు... బాబు ఇలాకాలో రికార్డు మోత
స్థానికసంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలయ్యింది. మొదటిరోజు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నామినేషన్లు దాఖలయ్యాయి.
విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఇప్పటికే జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు లకు షెడ్యూల్ విడుదలడమే కాదు నిన్నటి(సోమవారం) నుండి నామినేషన్ల స్వీకరణ మొదలయ్యింది. అయితే ఇంతవరకు రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపిక చేపడుతుండగా స్వతంత్రులు మాత్రం నామినేషన్లు వేస్తున్నారు.
ఇలా జిల్లాలవారిగా మొదటిరోజు(మార్చి 9వ తేదీ)సాయంత్రానికి 13 జిల్లాల్లోని మొత్తం 652 జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలకు గాను 68మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 9947 మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాలకు గాను 771 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల వివరాలు
1) శ్రీకాకుళంలో మొత్తం 38...మొదటి రోజు నామినేషన్లు 1
2) విజయనగరం మొత్తం 34... మొదటి రోజు నామినేషన్లు 2
3) విశాఖపట్నం మొత్తం 39... మొదటి రోజు నామినేషన్లు 3
4) తూర్పుగోదావరి మొత్తం 61... మొదటి రోజు నామినేషన్లు 2
5) పశ్చిమగోదావరి మొత్తం 48...మొదటి రోజు నామినేషన్లు 6
6) కృష్ణా మొత్తం 46... మొదటి రోజు నామినేషన్లు 2
7) గుంటూరు మొత్తం 54... మొదటి రోజు నామినేషన్లు 2
8) ప్రకాశం మొత్తం 55... మొదటి రోజు నామినేషన్లు 6
9) ఎస్పీఎస్సార్ నెల్లూరు మొత్తం 46... మొదటి రోజు నామినేషన్లు 7
10) కర్నూలు మొత్తం 53... మొదటి రోజు నామినేషన్లేవీ రాలేవు.
11) అనంతపురం మొత్తం 63... మొదటి రోజు నామినేషన్లు 9
12) చిత్తూరు మొత్తం65...మొదటి రోజు నామినేషన్లు 22
13) వైఎస్ఆర్ కడప మొత్తం 50... మొదటి రోజు నామినేషన్లు 6
మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల వివరాలు
1) శ్రీకాకుళం (667) కుగాను 40
2) విజయనగరం(549)కుగాను 14
3) విశాఖపట్నం(651)కుగాను 38
4) తూర్పుగోదావరి(1086)కుగాను 93
5) పశ్చిమగోదావరి(863)కుగాను 71
6) కృష్ణా(723) కుగాను 50
7) గుంటూరు(805) కుగాను 32
8) ప్రకాశం(742) కుగాను 47
9) ఎస్పీ నెల్లూరు(554) కుగాను 39
10) కర్నూలు(804) కుగాను 37
11) అనంతపురం(841) కుగాను 78
12) చిత్తూరు(858) కుగాను 213
13) వైఎస్ఆర్ కడప(804) కుగాను 19 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.