అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం డిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో మరికొద్దిరోజుల్లో జరగనున్న కీలక కార్యక్రమాలకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. వారిని కలుసుకోడానికి అపాయింట్ లభించడంతో ఆయన హుటాహుటిన డిల్లీకి పయనమైనట్లు తెలుస్తోంది.    

మరికాసేపట్లో ఢిల్లీ పయనంకానున్న జగన్ సాయంత్రం 6 గంటలవరకు అక్కడికి చేరుకోనున్నారు. రాత్రి అక్కడే బస బస చేసి శుక్రవారం ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా ను కూడా కలిసే అవకాశాలున్నాయి. 

read more  నన్ను ఆపితే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా: జగన్ కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఈ నెల 23 స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ను రావాల్సిందిగా జగన్ ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అలాగే వచ్చే నెల 9న ప్రారంభించనున్న ప్రతిష్టాత్మక అమ్మ ఒడి కార్యక్రమానికి కూడా ప్రధానిని జగన్ ఆహ్వానించనున్నట్లు సమాచారం. 

ఇక ప్రస్తుతం కొనసాగుతున్న రాజరీయ  పరిణాలపై కూడా ప్రధానితో జగన్ చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారడంతో ఎన్డీయేలో వైసీపీ చేరే అంశంపైనా వీరు చర్చించనున్నట్లు సమాచారం. దీంతో జగన్ ఢిల్లీ టూర్ కు ప్రాధాన్యత సంతరించుకుంది.