అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో ముందుడుగు వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా వారికిచ్చిన హామీని నెరవేర్చే ఉద్దేశంతో ఏకంగా రూ.269.99 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దీంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ప్రకటన వెలువడినప్పటి నుండి అగ్రిగోల్డ్ బాధితులతో పాటు వైఎస్సార్‌సిపి నాయకులు జగన్ పోటోలతో సంబరాలు జరుపుతున్నారు.

ఈ క్రమంలో వైఎస్సార్‌సిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అదనపు కార్యదర్శి నడింపల్లి కృష్ణ రాజు ఆద్వర్యంలో నగర పార్టీ కార్యాలయం సంబరాలు జరుపుకున్నారు. మిగతా నాయకుల మాదిరిగా కాకుండా ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటను నిలబెట్టుకుని తమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ మరింత గొప్ప నాయకుడిగా మారిపోయాడని కృష్ణరాజు కొనియాడారు.

అగ్రి గోల్డ్ బాధితల తరపున జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మిగతా నాయకులు, కార్యకర్తలతో కలిసి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులను  పట్టించుకుని వారిని ఆదుకోడానికి ముందుకొచ్చిన జగన్ వారి జీవితాల్లో కొత్తవెలుగులు నింపుతున్నారని అన్నారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పార్టీ అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు అక్కరమాని విజయ నిర్మల, రాష్ట్ర పార్టీ అదనపు కార్యదర్శి రవి రెడ్డి, మొల్లి అప్పారావులు పాల్గొన్నారు.

అలాగే విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ ఎస్సి విభాగం సమన్వయకర్తలు ప్రేమ బాబు, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు బోని శివ రామకృష్ణ, కాళిదాస్ రెడ్డి , పార్లమెంట్ అనుబంధ విభాగాల అధ్యక్షులు కే.రామన్నపాత్రుడు, మాజీ కార్పొరేటర్లు రామకృష్ణ రెడ్డి , లక్ష్మి రాము, విశాఖ తూర్పు యువజన విభాగం అసెంబ్లీ ఇంచార్జి బాయన సునీల్, నగర అనుబంధ విభాగాల సభ్యులు చుక్కర్ శేఖర్, వార్డు పార్టీ అధ్యక్షులు పీతల గోవింద్, రవికుమార్, గిరిబాబు, గణేష్ రెడ్డి,  కనరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇటీవలే వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం సొంత ఆటోలు కలిగి ఉన్న డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. దీంతో అమలాపురంలో ది సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్ కు చెందిన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ నల్లవంతెన సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద వైఎస్ జగన్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు పాల్గొన్నారు.  

ఇలా జగన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో వరుస పాలాభిషేకాలు జరుగుతున్నాయి.  అగ్రిగోల్డ్ విషయంలో ఆయన తీసుకున్ని నిర్ణయంపై ఇప్పటికే సర్వత్రా అభినందనలు వెల్లువెత్తగా ఇప్పుడు పాలాభిషేకాలు కూడా మొదలయ్యాయి.