ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఆడపిల్లలపై అత్యాచారాలు అగడం లేదు. దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అఘాయిత్యాలు జరగుతునే ఉన్నాయి.

అప్పుడే పసిపిల్లల నుంచి మెుదలుకుని కాటికి కాళ్లు చాపిన ముసలివాళ్ల వరకు ఎవరినీ కామాంధులు వదలడం లేదు.తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ బాలికపై 8 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

అక్టోబర్‌28న  ఆ బాలిక తన చిన్ననానమ్మ గ్రామమైన గంగోలు వెళ్లేందుకు సాయిబాబా గుడి వద్ద  నిలుచుంది. ఈ క్రమంలో  అక్కడ ఓ ఆటో కనిపించడంతో దాని దగ్గరకు వెళ్ళింది. అందులో డ్రైవర్  ముత్తారపు వెంకటేష్‌‌ను తన గమ్యానికి చేర్చాల్సిందిగా కోరింది. దానికి  సరే అని చెప్పి ఆ బాలికకు కొంత దూరం తీసుకెళ్ళిఅఘాయిత్యానికి పాల్పడాలనుకున్నాడు.

కానీ కుదరకపోవడంతో తన స్నేహితులతో కలిసి ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు, మిత్రులైన సందెళ్ల రామాపురం గ్రామానికి చెందిన సోడె రాంబాబు ఏలియాస్‌ బాబు, పొడియం సాయి, తెల్లం కృష్ణ, ఆంతోటి ప్రశాంత్, వినయ్‌లతో కలిసి వెంకటేష్‌‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మిగితా వారు కాపాలా ఉండగా ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు.  

అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చేప్పితే చంపేస్తామని బెదిరించి బాలికను ఆటో ఎక్కించి పంపించారు..మరిసటి రోజు బాలికపై అత్యాచారం జరిపిన వారిలో ఒకడు తిరిగి ఆమెను వెంబండించి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.


ఈ దారుణాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అత్యాచారానికి పాల్పడిన  వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

వారిలో కొందరు నిందుతులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తేలిపారు. వారిపై అత్యాచార నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.