నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. 

నల్గొండ: శివరాత్రి పండగ పూట కేతెపల్లి మండలం గుడివాడ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా గ్రామస్తులు ఘనంగా శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా అగ్నిగుండం ఏర్పాటుచేయగా ప్రమాదవశాత్తు అందులోపడి ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

శివరాత్రి సందర్భంగా గుడివాడ గ్రామంలోని దేవాలయం వద్ద అగ్నిగుండం ఏర్పాటుచేస్తారు. ఈ అగ్నిగుండంలో నడవడం ఎంతో పవిత్రం కావడమే కాకుండా కోరుకున్న మొక్కులు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో నిప్పులపై నడిచేందుకు చాలామంది భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.

read more మహాశివరాత్రి : వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన ఈటెల రాజేందర్

ఈక్రమంలోనే అగ్నిగుండంలో నడిచేందుకు భక్తులు భారులు తీరారు. ఈ గుండం వద్ద సరయిన ఏర్పాట్లు చేయపోవడంతో ముందుకు వెళ్లడానికి భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అగ్నిగుండంలో పడి ఆరుగురు భక్తులు గాయపడ్డారు. 

వెంటనే గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఇద్దరు భక్తులకు తీవ్రమైన కాలిక గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మిగతావారి పరిస్థితి బాగానే వుందన్నారు.