కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తప్పిపోయిన చిన్నారి ఆచూకీ లభించింది. ముంబై నుండి స్వగ్రామమైన గూడూరు కు వెళ్లేందుకు బుధవారం ఉదయం ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చింది.

అక్కడ లగేజీ సర్దుకుంటుండగా వీరి నాలుగు సంవత్సరాల బాలిక లిప్సిక ఒక్కసారిగా అదృశ్యమైంది. దీంతో కంగారుపడిన తల్లీదండ్రులు స్థానికుల సాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. ఎమ్మిగనూరు బస్టాండ్ నుంచి వెళ్లిన ప్రతి బస్సును అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో లిప్సిక కర్నూలు బస్సులో దొరికింది. చిన్నారి తమ తల్లిదండ్రులు కర్నూలు వెళ్లే బస్సులో ఉన్నారని భావించి ఆ బస్ ఎక్కింది. పాప క్షేమంగా తమ వద్దకు చేరడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read:జేసీకి షాక్: వైసీపీలో చేరిన ప్రధాన అనుచరుడు షబ్బీర్

Also Read: వల్లభనేని వంశీపై మాట్లాడబోను: యార్లగడ్డ వెంకట్రావు