Asianet News TeluguAsianet News Telugu

జేసీకి షాక్: వైసీపీలో చేరిన ప్రధాన అనుచరుడు షబ్బీర్

అనంతపురం జిల్లాలో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి షాక్ తగిలింది. జేసీ దివాకర్  రెడ్డి ప్రధాన అనుచరుడు షబ్బీర్ భాషా వైసీపీలో చేరారు. 

Tdp leader Shabbir Basha joins in Ysrcp in Ananatapuram district
Author
Anantapur, First Published Nov 20, 2019, 1:51 PM IST

అనంతపురం: అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌ ప్రధాన అనుచరుడు షబ్బీర్ బాషా అలియాస్ గోరా బుధవారం నాడు వైసీపీలో చేరారు. గోరాతో పాటు  ఆయన పలువురు కూడ వైసీపీలో చేరారు.

బుధవారం నాడు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో  గోరా టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడ వీరికి వైసీపీ కండువా కప్పి  వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  గోరాతో పాటు ట్రాన్స్‌పోర్టు యూనియన్ కు సంబంధించిన వారు కూడ వైసీపీలో చేరారు.

Also read:పార్టీ మారుతూ అధినేతను ఏదో ఒకటి అంటున్నారు: వంశీపై జేసీ ఫైర్

అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌ హవాకు బ్రేకులు పడుతున్నాయా అనే చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో కూడ టీడీపీ నుండి కొందరు నేతలు వైసీపీలో చేరారు.టీడీపీ నేతలు పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేసీ సోదరులు తమ వారసులను రంగంలోకి దించారు. కానీ వారిద్దరూ కూడ ఓటమి పాలయ్యారు.

తాడిపత్రి నుండి జేసీప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, అనంతపురం ఎంపీ స్థానం నుండి జేసీ దివాకర్ రెడ్డి  కొడుకు జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరూ కూడ ఓటమి పాలయ్యారు.

2014 ఎన్నికలకు ముందు జేసీ దివాకర్ రెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో  తాడిపత్రి నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా, అనంతపురం ఎంపీ స్థానం నుండి జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి విజయం సాధించారు. 

అయితే  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేయలేదున తమ  రాజకీయ వారసులుగా  కొడుకులను బరిలో దింపారు.జేసీ దివాకర్ రెడ్డికి చెందిన .ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.ఈ విషయమై ట్రిబ్యునల్ కూడ తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కూడ ప్రైవట్ ట్రావెల్స్ బస్సులను  వదలలేదని  జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు.

 అయితే ఈ విషయమై తాను కోర్టును కూడ ఆశ్రయిస్తానని జేసీదివాకర్ రెడ్డి చెప్పారు. అంతేకాదు తనను పార్టీ మారాలని ఒత్తిడి తీసుకు వస్తున్నారని  జేసీ దివాకర్ రెడ్డి ఇటీవలనే ఆరోపించారు.తమ ట్రావెల్స్ బస్సులను వదిలేయని విషయమై అధికారులపై కేసు కూడ వేస్తానని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios