రిషబ్ పంత్... ఈ యువ ఆటగాడు గతంలో ఆస్ట్రేలియా జట్టుపై అద్భుతంగా ఆడి ఒక్క మ్యాచ్ తో హీరోగా మారాడు. మళ్లీ అదే జట్టుపై పేలవ ప్రదర్శన చేసి విమర్శల పాలవుతున్నాడు. ఇలా మొహాలీ వన్డేలో రిషబ్ వికెట్ కీఫింగ్ లో తడబడి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అయితే ఇలాంటి ఇబ్బందికర సమయంలో రిషబ్ కు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్నా మద్దతుగా నిలిచారు. 

మొహాలీ వన్డే ఓటమిపై గురించి ఆకాశ్ ప్రస్తావిస్తూ...  ఇక్కడ చివరగా జరిగిన ఆరు మ్యాచులకు గానూ ఐదింట్లో చేజింగ్ చేసిన జట్టే గెలించింది. అయితే ఓడిన జట్లేవీ కూడా తక్కువ స్కోరేమీ చేయలేదు. అన్నీ యావరేజ్ గా 300 స్కోరు చేశారు. కాబట్టి ఓటమికి ఒక్క ఆటగాడిని బాధ్యున్ని చేయడం ఆపాలని భారత అభిమానులకు చోప్రా సూచించారు. 

అలాగే యువ క్రికెటర్ రిషబ్ పంత్ ను సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని తో పోల్చడం ఆపేయాలన్నారు.   ముఖ్యంగా కీపింగ్ విషయంలో ఇద్దరిని పోల్చవద్దని సూచించారు. అతడు ఇంకా నేర్చుకునే స్థాయిలోనే వున్నాడని...అప్పుడే సీనియర్లతో పోల్చితే అతడిపై ఒత్తిడి పెరిగే అవకాశముందన్నారు. అయితే అతడికి భారత జట్టులో స్థానం కల్పించడం కరెక్టేనా? అని మీరు ప్రశ్నిస్తే నేనే అవుననే సమాధానం చేప్తానన్నారు. ఇలా రిషబ్ పంత్ కు చోప్రా తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. 

ఒకవేళ రిషబ్ పంత్ ని ప్రపంచ కప్ జట్టులో ఎంపిక చేసినా ధోనికి కాదని ఆడించలేరని...ముఖ్యంగా కీఫర్ గా మాత్రం అవకాశమివ్వరని వివరించారు. కాబట్టి రిషబ్ ను ఒక్క కీపర్ గా మాత్రమే చూడటం ఆపాలన్నారు. తన అభిప్రాయం ప్రకారం మొహాలీ వన్డేలో రిషబ్ బాగానే ఆడాడని చోప్రా పేర్కొన్నారు. 

మొహాలీ వన్డేలో 358 పరుగుల కాపాడుకోలేక భారత జట్టు ఓటమిపాలవ్వడానికి వికెట్ కీపర్ రిషభ్ పంతే కారణమంటూ నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పంత్ జట్టులోకి తీసుకొగా... కీపింగ్‌లో అతని డొల్ల తనం బయటపడింది. సులువైన క్యాచ్‌తో పాటు రెండు కీలక స్టంపౌట్‌లను చేజార్చి అతను భారత విజయావకాశాలను దెబ్బ తీశాడు. ఓ స్టంపౌట్‌ను ధోని స్టైల్‌లో చేయబోయి విఫలమయ్యాడు. దీంతో పంత్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు.