Asianet News TeluguAsianet News Telugu

డిల్లీ వన్డే ఓటమికి వారిద్దరే కారణం: సంజయ్ మంజ్రేకర్

డిల్లీ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోడానికి భారత మిడిల్ ఆర్డర్ వైఫల్యమే కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఈ స్థానాల్లో బరిలోకి దిగిన యువ ఆటగాళ్ళు రిషబ్ పంత్, విజయ్ శంకర్ ల వల్లే ఈ మ్యాచ్‌లో భారత ఓటమిపాలయ్యిందన్నారు. ఈ వైఫల్యం కేవలం మ్యాచ్ నే కాదు వన్డే సీరిస్ ను కూడా టీమిండియాకు దూరం చేసిందని మంజ్రేకర్ అన్నారు. 

veteran cricketer sanjay manjrekar comments on delhi odi lose
Author
Delhi, First Published Mar 14, 2019, 2:06 PM IST

డిల్లీ వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోడానికి భారత మిడిల్ ఆర్డర్ వైఫల్యమే కారణమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఈ స్థానాల్లో బరిలోకి దిగిన యువ ఆటగాళ్ళు రిషబ్ పంత్, విజయ్ శంకర్ ల వల్లే ఈ మ్యాచ్‌లో భారత ఓటమిపాలయ్యిందన్నారు. ఈ వైఫల్యం కేవలం మ్యాచ్ నే కాదు వన్డే సీరిస్ ను కూడా టీమిండియాకు దూరం చేసిందని మంజ్రేకర్ అన్నారు. 

డిల్లీ వన్డేకు ముందు భారత్-ఆస్ట్రేలియాలు 2-2తో సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే వన్డే సీరిస్ విజయాన్ని నిర్ణయించే ఐదో వన్డే బుధవారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాట్ మెన్స్ ఘోరంగా విఫలమవడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ నిర్ధేశించిన 273 లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. ఇలా ప్రపంచ కప్ కు ముందు భారత్ స్వదేశంలో వన్డే సీరిస్ కోల్పోవడానికి కారణమైన ఆటగాళ్లపై మంజ్రేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముఖ్యంగా భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ రిషబ్ పంత్, విజయ్ శంకర్‌లు ఈ వన్డేలో తీవ్రంగా నిరాశపర్చారని అన్నారు. ప్రపంచ కప్ కు ముందు వచ్చిన మంచి అవకాశాన్ని వారు చేజేతులా జారవిడుచుకున్నారన్నారు. వారిద్దరు భారీ షాట్లతో బంతిని గాల్లోకి లేపుతూ కాకుండా గ్రౌండ్ షాట్లు ఆడివుంటే బావుండేదన్నారు. ఈ విషయంలో వారు కెప్టెన్ కోహ్లీని ఫాలో అయితే బావుంటుందన్నారు. 

ఇలా స్వదేశంలో వన్డే సీరిస్ కోల్పోవడం ప్రపంచ కప్ లో భారత జట్టుపై తీవ్ర ప్రభావం  చూపించే అవకాశముందన్నారు. అందువల్ల ఈ సీరిస్ లో  ప్రధాన సమస్యగా మారిన మిడిల్ ఆర్డర్‌‌ను పటిష్టం చేస్తేగాని ప్రపంచ కప్ లో భారత విజయావకాశాలు మెరుగుపడవని మంజ్రేకర్ సూచించారు.   
  
Follow Us:
Download App:
  • android
  • ios