Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ అభిమానులూ...మళ్లీ మన సమయం వచ్చింది: డేవిడ్ వార్నర్ (వీడియో)

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా జట్టుతో పాటు గతేడాది ఐపిఎల్ సీజన్ కు డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. అయితే ఇది ఆసిస్ అభిమానులను  ఎంతలా నిరాశపర్చిందో అంతకంటే ఎక్కువగా హైదరాబాద్ క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. ఎందుకంటే ఐపిఎల్ లో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు
కెప్టెన్ గానే కాదు తన విద్వంసకర ఆటతీరుతో ఒంటిచేత్తో ఎన్నొ మ్యాచులు గెలిపించిన ఆటగాడు. అలాంటిది గత ఐపిఎల్ సీజన్ లో అతడి బ్యాట్ నుండి జాలువారే విద్వంకర షాట్లతో ఫుల్ ఎంటర్ టయిన్ కావాలనుకున్న హైదరబాదీలు నిరాశకు గురయ్యారు. 

sunrisers hyderabad team captain david warner video
Author
Hyderabad, First Published Mar 12, 2019, 8:17 PM IST

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా జట్టుతో పాటు గతేడాది ఐపిఎల్ సీజన్ కు డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. అయితే ఇది ఆసిస్ అభిమానులను  ఎంతలా నిరాశపర్చిందో అంతకంటే ఎక్కువగా హైదరాబాద్ క్రికెట్ అభిమానులను నిరాశకు గురిచేసింది. ఎందుకంటే ఐపిఎల్ లో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గానే కాదు తన విద్వంసకర ఆటతీరుతో ఒంటిచేత్తో ఎన్నొ మ్యాచులు గెలిపించిన ఆటగాడు. అలాంటిది గత ఐపిఎల్ సీజన్ లో అతడి బ్యాట్ నుండి జాలువారే విద్వంకర షాట్లతో ఫుల్ ఎంటర్ టయిన్ కావాలనుకున్న హైదరబాదీలు నిరాశకు గురయ్యారు. 

అయితే గతేడాదితో పాటు ప్రస్తుత సీజన్ క్రికెట్ మజాను ఒకేసారి అందించడానికి డేవిడ్ వార్నర్ సిద్దమయ్యాడు. తనపై విధించిన సస్పెన్షన్ ఈ ఐపిఎల్ లోపు పూర్తవుతుండటంతో తిరిగి ఆరెంజ్ ఆర్మీని హుషారెత్తించడానికి అతడు సిద్దమవుతున్నాడు. ఐపిఎల్ మజాను ఆస్వాదించడానికి సన్ రైజర్స్ అభిమానులు సిద్దంగా వుండాలంటూ వార్నర్ తెలిపాడు. సన్ రైజర్స్ జట్టుకు సంబంధించిన అధికారిక ట్విట్టర్ పేజిలో ఈమేరకు వార్నర్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

''ఆరెంజ్ ఆర్మీకి స్పెషల్ మెసేజ్. గత సంవత్సరకాలంగా మీ అపరిమితమైన ప్రేమను నాపై చూపిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక మళ్లీ మన సమయం వచ్చింది.'' అంటూ హైదరాబాద్ జట్టు అభిమానుల్లో వార్నర్ మరింత జోష్ నింపారు. 

2016 ఐపిఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ విజయం సాధించడంలో  వార్నర్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సీజన్ మొత్తంలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్ లో చాలా మ్యాచులను వార్నర్ ఒంటి చేత్తో గెలిపించి హైదరాబాద్ కు రెండో టైటిట్ అందించాడు. దీంతో మరోసారి అలాంటి ప్రదర్శన కోరుకుంటున్న హైదరబాదీలకు ఈ ఐపిఎల్ కు ముందే వార్నర్ నుండి హామీ లభించింది.   

వీడియో

derabad.in #500ForYou

 

Follow Us:
Download App:
  • android
  • ios