భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు. సొంత మైదానమైన నాగ్ పూర్ విసిఏ(విదర్భ క్రికెట్ అపోసియేషన్ స్టేడియం)లో రోహిత్ పరుగులేమీ సాధించకుండాను డకౌటయ్యాడు. ఇలా ఇప్పటివరకు సొంత మైదానంలో జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో అతడు డకౌటవడం ఇదే మొదటిసారి. ఇలా సొంత ప్రేక్షకుల ముందు పేలవ ఆటతీరుతో రోహిత్ ఓ చెత్త రికార్డున తన ఖాతాలో వేసుకున్నాడు.  

ఇక కేవలం ఒక్క ఆసిస్ జట్టు పైనే రోహిత్ ఇలా రెండు సార్లు డకౌటయ్యాడు. 2012 లో బిస్బస్ లో మొదటిసారి ఆసిస్ పై పరుగులేవీ సాధించకుండా పెవిలియన్ చేరగా...తాజాగా మళ్లీ నాగ్ పూర్ లో అదే తరహాలో డకౌటయ్యాడు.

హైదరాబాద్ వన్డే విజయమిచ్చిన జోష్ తో నాగ్ పూర్ వన్డేలో బరిలోకి టీమిండియా కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లతో పాటు అంబటి రాయుడు కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ వైపు వికెట్లు పడుతున్నా తన జోరును కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అతడు హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మొత్తంగా భారత్ ప్రస్తుతం 21 ఓవర్లలో 103 పరుగులు చేసి మూడు కీలక వికెట్లే కోల్పోయింది.