Asianet News TeluguAsianet News Telugu

నాగ్‌పూర్ వన్డేలో కంగారెత్తించిన విజయ్ శంకర్...ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం

ఉత్కంఠ పోరులో భారత్ అస్ట్రేలియాపై రెండో వన్డేలో విజయం సాధించింది. ఎనిమిది పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి 5 మ్యాచుల సిరీస్ లో 2-0 స్కోరుతో ముందంజలో ఉంది. చివరి ఓవరులో రెండు వికెట్లు తీసి విజయ్ శంకర్ మాయ చేశాడు.

nagpur odi updates
Author
Nagpur, First Published Mar 5, 2019, 1:35 PM IST

నాగ్ పూర్ లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. చివరి ఓవర్లో విజయ్ శంకర్ మ్యాజిక్ బౌలింగ్ తో రెండు వికెట్లు పడగొట్టి భారత్ కు విజయాన్ని అందించాడు. దీంతో 8 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 250 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 242 పరుగులకు ఆలౌట్ అయి ఓటమిని మూటగట్టుకుంది. దీంతో ఐదు మ్యాచుల సిరీస్ లో భారత్ 2-0 స్కోరుతో భారత్ ముందంజలో ఉంది.భారత బౌలర్లలో కుల్దీప్ మూడు వికెట్లు తీసుకోగా, విజయ్ శంకర్, బుమ్రా రెండేసి వికెట్లు తీసుకన్నారు. జడేజా, జాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.

చివరి ఓవర్లో విజయ్ శంకర్ మ్యాజిక్ చేశాడు. హాఫ్ సెంచరీతో ఆసిస్ ను విజయానికి చేరువగా తీసుకువచ్చిన స్టోయినీస్ ను ఔట్ చేశాడు. దీంతో ఇంకా ఐదు బంతుల్లో ఆసిస్ కు 11 పరుగుుల అవసరముండగా..భారత్ కు ఓ వికెట్ అవసరమైంది. ఆ స్థితిలో విజయ్ శంకర్ మరో వికెట్ తీసి భారత్ కు విజయాన్ని అందించాడు.

నాగ్ పూర్ వన్డేలో టీమిండియా బౌలర్ బుమ్రా తన చివరి ఓవర్లలోబ మ్యాజిక్ చేస్తున్నాడు.. 45వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి అమాంతం మ్యాచ్ ను ఇండియా వైపు తిప్పాడు. ఈ స్థితిలో ఆసిస్ విజయానికి 25 బంతుల్లో 28 పరుగుల అవసరముండగా...భారత్ కు రెండు వికెట్లు అవసరమున్నాయి. 

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కళ్లు చేదిరే త్రో తో ఆసిస్ బ్యాట్ మెన్ హ్యాండ్స్ కోబ్ ను రనౌట్ చేశాడు. దీంతో 48 పరుగల వ్యక్తిగత స్కోరు వద్ద హ్యాండ్స్ కోంబ్ హాఫ్ సెంచరీ మిస్సై రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. 

టీ20 లో భారత విజయాన్ని అడ్డుకున్న సెంచరీ వీరుడు మ్యాక్స్ వెల్ ను కుల్దీప్ ఓ అద్భుతమైన బంతితో బొల్తా కొట్టించాడు.దీంతో ఆసిస్ 132 పరుగుల వద్ద నాలుగొో వికెట్ కోల్పోయింది. కేదార్ జాదవ్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఓపెనర్ ఖవాజా ఔటయ్యాడు. ఇలా 83 పరుగుల వద్దే ఆసిస్ ఓపెనర్లిద్దరిని కోల్పోయింది.  

ఎట్టకేలకు ఆసిస్ ఓపెనర్లను విడదీయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. ఆ జట్టు కెప్టెన్ ఫించ్ ను కుల్దీప్ యాదవ్ బురిడీకొట్టించి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇలా లక్ష్యఛేదనవైపు వడివడిగా దూసుకెళుతున్న ఆసిస్ ఇన్సింగ్స్ కు ఓ చిన్న బ్రేక్ పడింది. 

251 పరుగుల లక్ష్యఛేదించే క్రమంలో ఆసిస్ బ్యాాటింగ్ ను దాటిగా ఆరంభించింది. ఆసిస్ ఓపెనర్లు నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేశారు. ఖవాజా దాటిగా ఆడుతుండగా కెప్టెన్ ఫించ్ అతడికి చక్కటి సహకారం అందిస్తూ వచ్చాడు. దీంతో ఆసిస్ 11 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండానే  76 పరుగులు చేసింది. 

నాగ్ పూర్ వన్డేలో టీమిండియా 250 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ కోహ్లీ సెంచరీతో చేలరేగడం భారత్ కు ఈ స్కోరు సాధ్యమయ్యింది. ఆసిస్ బౌలర్లో కమ్మిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టి టీమిండియాను అతి తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాడు. సెంచరీ తర్వాత చివరి ఓవర్లలో మరిన్ని పరుగుల సాధించాలని ప్రయత్నించి కోహ్లీ వికెట్ సమర్పించుకున్నాడు. 116 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

రెండో వన్డేలో ఓవైపు వికెట్లు పడుతున్నా టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో కోహ్లీ వన్డే క్రికెట్ సెంచరీల సంఖ్య 40 కి చేరింది. మొత్తంగా టీమిండియా 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులకు చేరింది. 

భారత్ 39 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 202 పరుగులు సాధించింది. హైదరాబాద్ వన్డేలో తన అద్భుతమైన బ్యాటింగ్ తో టీమిండియాను విజయతీరాలకు చేర్చిన ధోని, కేదార్ జాదవ్ నాగ్ పూర్ వన్డేలో మాత్రం పేలవమైన ఆటతీరును కనబర్చారు. వీరిద్దరు ఒకరివెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు. మొదట జాదవ్ జంపా వేసిన 32  వ ఓవర్ రెండో బంతికి జాదవ్ ఔటవగా ఆ తర్వాతి బంతికే ధోని ఔటయ్యాడు.. దీంతో భారత్ 171 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 

టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను దురదృష్టం వెంటాడింది. దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువైన సమయంలో అనూహ్యరీతిలో అతడు రనౌటయ్యాడు. జంపా బౌలింగ్ కోహ్లీ స్టేట్ షాట్ ఆడగా మరో ఎండ్ లోని శంకర్ క్రీజులోంచి కొద్దిగా బయటకు వచ్చాడు. దీంతో వికెట్ల వైపు వెళుతున్న బౌల్ కు  జంపా కేవలం చేయి తాకించాడు. అదికాస్తా నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో శంకర్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. 

అంతకు ముందు నాగ్ పూర్ వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ అర్థశతకం సాధించాడు. సున్నా పరుగుల వద్దే ఓపెనర్ వికెట్ కోల్పోయిన సమయంలో బరిలోకి దిగిన కోహ్లీ నిలకడగా ఆడుతూ  ఆసిస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లీ విజృంభనతో టీమిండియా 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కోహ్లీకి విజయ్ శంకర్(29) మంచి సహకారం అందించాడు. 

ఓవైపు వికెట్లు పడుతున్నా టీమిండియా కెప్టెన్ కోహ్లీ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును మెల్లగా ముందుకు నడిపించాడు. తక్కువ స్కోరు వద్దు ఓపెనర్లిద్దరు ఔటవడంతో కెప్టెన్ తో కలిసి అంబటి రాయుడు ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే అతడి ప్రయత్నం ఎక్కువసేపు సాగలేదు. రాయుడు 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద  లయన్ బౌలింగ్ లో ఎల్బీగా ఔటయ్యాడు. 

రోహిత్ డకౌట్ తర్వాత కాస్త నెమ్మదిగా  ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డప్పటికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ధావన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 38 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.  

రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ దిగిన భారత్ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.మొదటి ఓవర్లోను పరుగుల ఖాతా తెరవక ముందే ఓపెనర్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. కమ్మిన్స్ బౌలింగ్ లో జంపాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. దీంతో భారత్ పరుగులేవీ సాధించకుండానే వికెట్ కోల్పోయింది.  

ఐదువన్డేల సీరీస్ లో భాగంగా జరిగిన నాగ్ పూర్ వన్డేలో ఆసిస్ జట్టు టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ వన్డేలో మొదట బ్యాటింగ్ కు దిగి చతికిలపడ్డ అనుభవం దృష్ట్యా ఆసిస్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పీచ్ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని లక్ష్యచేధన ఈజీగా వుంటుందన్న ఉద్దేశ్యంతో ఆసిస్ ఫీల్డింగ్ కు మొదటి ప్రాధాన్యతనిచ్చింది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది.

తుది జట్ల విషయానికి వస్తే భారత్ మొదటి వన్డే జట్టులో మార్చులేవీ లేకుండా బరిలోకి దిగింది. ఆసిస్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్పిన్నర్లు నాథన్ లయన్, షాన్ మార్ష్ లను జట్టులోకి తీసుకుంది.

భారత తుది జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని( వికెట్ కీఫర్), కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ సింగ్ బుమ్రా

ఆస్ట్రేలియా తుది జట్టు:

ఆరోన్ పించ్(కెప్టెన్), షాన్ మార్ష్, స్టోయినీస్, హ్యండ్స్‌కోబ్, మ్యాక్స్ వెల్, క్యారీ, కుల్టెర్ నైల్, కమ్మిన్స్, నాథర్ లియాన్, జంపా
 

Follow Us:
Download App:
  • android
  • ios