నాగ్ పూర్ వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఒక్క సక్సెస్‌ఫుల్ ఓవర్ హీరోను చేసిపెట్టింది. అయితే ఇలాంటి ఓ చివరి ఓవరే గతంలో అభిమానుల దృష్టిలో అతడిని విలన్ గా కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ ద్వారానే తాను చాలా విషయాలే నేర్చుకున్నట్లు... ఒత్తిడిని తట్టుకుని ప్రశాంతంగా ఎలా వుండాలో తెలుసుకున్నానని విజయ్ శంకర్ వెల్లడించారు. ఇలా తన కెరీర్లో అత్యంత పరాభవంపాలవడానికి కారణమైన మ్యాచ్ నుండి చాలా విషయాలు నేర్చుకుని రాటుదేలినట్లు విజయ్ వెల్లడించి భవిష్యత్ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు.

శ్రీలంక వేదికగా జరిగిన నిదహస్ ట్రోపి(టీ20) ఫైనల్ మ్యాచ్‌లో విజయ్ శంకర్ అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలపాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా చివరి ఓవర్లలో అతడి ఆటతీరు భారత అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యింది. ఓ వైపు సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోతుండగా విజయ్ పరుగులు సాధించడానికి ఇబ్బంది పడటంతో అతడు క్రికెటర్ గా పనికిరాడంటూ అభిమానులు ట్రోల్స్ చేశారు. బంగ్లాందేశ్ బౌలర్లను చివరి ఓవర్లో ఉతికేసిన 8 బంతుల్లో 29 పరుగులు సాధించడం ద్వారా భారత్ కు విజయాన్ని అందించి దినేష్ కార్తిక్ హీరోగా మారగా...19 బంతుల్లో 17 పరుగులు సాధించిన శంకర్ విలన్ గా మారాడు.
అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో ఒత్తిడిని తట్టుకోని అత్యుత్తమంగా బౌలింగ్ చేయడానికి నిదాహస్ ట్రోఫీయే కారణమని విజయ్ శంకర్ అన్నాడు. ఆ ట్రోఫి తనకు ఎన్నో విషయాలను నేర్పిందని... విమర్శలు వస్తూ కృంగిపోకుండా, ప్రశంసలకు పొంగిపోకుండా వుండాలని తెలియజేసిందన్నాడు. అంతేకాకుండా ఒత్తిడి అనేది ఎలా వుంటుందో...దాన్ని తట్టుకుని ప్రశాంతగా ఎలా ఆడాలో కూడా నేర్చుకున్నానని అన్నాడు. అదే అనుభవం నాగ్ పూర్ వన్డేలో పనిచేసిందని శంకర్ వెల్లడించాడు.
మంగళవారం నాగ్ పూర్ లోని విసిఏ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా ల మధ్య జరిగిన రెండో వన్డే ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో ఆసిస్ బ్యాట్ మెన్స్ ని కంగారెత్తించిన విజయ్ శంకర్ రెండు వికెట్లు తీసి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. ఇలా భారత్ కు ప్రతిష్టాత్మకమైన 500వ వన్డే విజయాన్ని అందించిన విజయ్ శంకర్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.