Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాకు తప్పని పరాభవం...1-0 ఆధిక్యంలో పర్యాటక జట్టు

స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సీరిస్‌ను భారత మహిళా జట్టు ఘనంగా ప్రారంభించడమే కాదు...సీరిస్‌ను గెలిచే వరకు అదే జోష్ ను కొనసాగింది. అయితే అదే జట్టుతో జరుగుతున్న  టీ20 సీరిస్ ను మాత్రం టీమిండియా ఓటమితో ఆరంభించింది. సోమవారం గౌహతి వేదికగా జరిగిన మొదటి టీ20లో ఆతిథ్య భారత్ పై  ఇంగ్లాడ్ మహిళా జట్టు 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
India women lose to England women by 41 runs
Author
Gauhati, First Published Mar 4, 2019, 3:24 PM IST

స్వదేశంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సీరిస్‌ను భారత మహిళా జట్టు ఘనంగా ప్రారంభించడమే కాదు...సీరిస్‌ను గెలిచే వరకు అదే జోష్ ను కొనసాగింది. అయితే అదే జట్టుతో జరుగుతున్న  టీ20 సీరిస్ ను మాత్రం టీమిండియా ఓటమితో ఆరంభించింది. సోమవారం గౌహతి వేదికగా జరిగిన మొదటి టీ20లో ఆతిథ్య భారత్ పై  ఇంగ్లాడ్ మహిళా జట్టు 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నీర్ణీత ఓవర్లలో 160 పరుగులు సాధించి  భారత్ ముందు 161 పరుగల లక్ష్యాన్ని వుంచిది. ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్ ఉమెన్స్  టామీ బ్యూమౌంట్‌(62 పరుగులు), హీతర్‌ నైట్‌(40 పరుగులు), డానిల్లీ వ్యాట్‌(35పరుగులు) రాణించారు. భారీ పరగులు సాధించకుండా ఇంగ్లాండ్ బ్యాట్ ఉమెన్స్ ను అడ్డుకోవడంతో భారత బౌలర్లు విఫలమయ్యారు. 

161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఇన్నింగ్స్ ఏ దశలోనూ చేధన దిశగా సాగలేదు. కెప్టెన్ మంధానతో సహా జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్ ఉమెన్స్ మొత్తం ఘోరంగా విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాట్ ఉమెన్స్ ఎవ్వరు కూడా రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోయారు. అయితే చివర్లో శిఖా పాండే(23పరుగులు), దీప్తి శర్మ(22 పరుగులు) నాటౌట్ గా నిలిచి భారత్ ను మరింత ఘోరంగా ఓడకుండా అడ్డుకున్నారు. 

భారత జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం 119 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయి లక్ష్యచేధనలో చతికిల పడింది. ఇలా మూడు టీ20 ల సీరిస్ లో భాగంగా జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 1-0తో ముందజలోకి వెళ్లిపోయింది. భారత ఉమెన్స్ జట్టు టీ20 సీరిస్ పై ఆశలు సజీవంగా వుంచుకోవాలంటే మిగతా రెండు టీ20లను తప్పకుండా గెలవాల్సిందే.     
 
Follow Us:
Download App:
  • android
  • ios