మూడో వన్డే మ్యాచులో ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ పోరాడి ఓడింది. విరాట్ కోహ్లీ గోడ నిలిచి సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా భారత్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ 48.2 ఓవర్లలో 281 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, రిచర్డ్సన్, జంపా మూడేసి వికెట్లు తీసుకోగా, లియోన్ ఒక వికెట్ తీశాడు.

తమ ముందు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 281 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. షమీ 8 పరుగులు చేసి అవుటయ్యాడు.ఇండియా 273 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా 24 పరుగులు చేసి అవుటయ్యాడు.భారత్ 251 పరుగుల వద్ద ఏడో వికెట్ ను జారవిడుచుకుంది. విజయ్ శంకర్ 30 బంతుల్లో 32 పరుగులు చేసి లియోన్ బౌలింగులో అవుటయ్యాడు.

ఇండియా కీలకమైన వికెట్ కోల్పోయింది.కెప్టెన్ విరాట్ కోహ్లీ 95 బంతుల్లో ఓ సిక్స్, 16 ఫోర్ల సాయంతో 123 పరుగులు చేసి జంపా బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 219 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.భారత్ 174 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. కేదార్ జాదవ్ జంపా బౌలింగులో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేశాడు. ఓ వైపు వికెట్లు రాలిపోతుంటే, మరో వైపు గోడలా నిలబడి 85 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు.

భారత్ 86 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 42 బంతుల్లో 26 పరుగులు చేసి జంపా బౌలింగులో అవుటయ్యాడు.భారత్ 27 పరుగులకే మూడు వికెట్లు జారవిడుచుకుంది. అంబటి రాయుడు కేవలం 2 పరుగులు చేసి కమిన్స్ కు వికెట్ సమర్పించుకున్నాడు.

భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లిద్దరు తక్కువ స్కోరుకే చేతులెత్తేశారు. శిఖర్ ధావన్ పది బంతులు ఆడి ఒక పరుగు మాత్రమే చేసి, రిచర్డ్సన్ బౌలింగులో అవుట్ కాగా, రోహిత్ శర్మ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికి భారత్  స్కోరు 15 పరుగులు మాత్రమే.

రాంచీ వన్డేలో ఆసీస్ భారత్‌కు 314 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివర్లో భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ ఊపును కొనసాగించలేకపోయింది. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఖవాజా 104, ఫించ్ 93, మ్యాక్స్‌వెల్ 47, స్టోయినిస్ 31 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ 3, షమీ 1 వికెట్ పడగొట్టారు. 

 కుల్‌దీప్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్ పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లలో భారత బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేశారు.. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కుల్‌దీప్ బౌలింగ్‌లో షాన్ మార్ష్ పెవిలియన్ చేరాడు.

ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న గ్లెన్ మాక్స్‌వేల్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఉన్నంత సేపు సిక్సర్లు, ఫోర్లతో మైదానంలో మెరుపులు మెరిపించాడు మాక్స్‌వేల్. కేవలం 31 ఓవర్లలోనే అతను 47 పరుగులు బాదాడు. ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. జోరుమీదున్న ఓపెనర్ ఖవాజా 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

ఆసీస్ ఓపెనర్ ఖవాజా సెంచరీ సాధించాడు. 107 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఖవాజా శతకం బాదాడు. ఇది అతనికి వన్డేల్లో తొలి సెంచరీఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. కుల్‌దీప్ బౌలింగ్‌లో 93 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫించ్ ఔటయ్యాడు.

ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఖవాజా, ఆరోన్ ఫించ్ మంచి ఆరంభాన్నిచ్చారు. ఫించ్ అర్థ సెంచరీ చేశాడు. అతను 51 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా అర్థ సెంచరీ చేశాడు. 56 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో అతను 50 పరుగులు చేశాడు. అప్పటికి అస్ట్రేలియా స్కోరు వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలో 121 పరుగులుగా ఉంది.

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా  జట్ల మధ్య శుక్రవారం రాంచీ వేదికగా  జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో సిరీస్ గెలవాలని భారత్ భావించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆసీస్ పట్టుదల నెగ్గింది.