క్రికెట్‌లో స్లెడ్జింగ్ అనేది రకరకకాల రూపాల్లో కనిపిస్తోంది. ఊపు మీదున్న ప్రత్యర్థిని మాటలతో చేతలతో కవ్వించి అతని దృష్టిని మరల్చడమే స్లెడ్జింగ్. ఆస్ట్రేలియన్లు ఇందులో సిద్ధహస్తులు.

అయితే ఇది శృతి మించితే మాత్రం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. గతంలోని సంఘటనలు ఇందుకు ఎన్నో ఉదాహరణలు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్ బట్లర్.. వెస్టిండీస్‌ బౌలర్ కార్టెల్‌ను స్లెడ్జింగ్ చేశాడు.

దీనిని వారిద్దరితో పాటు ఆటగాళ్లు, అభిమానులు ఎంజాయ్ చేశారు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డేలో జోస్ బట్లర్ రెచ్చిపోయాడు. కేవలం 77 బంతుల్లో 150 పరుగులు చేశాడు.

ఇందులో 13 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. బట్లర్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన విండీస్ బౌలర్ షెల్డన్ కార్టెల్‌ను అతను సరదాగా ఆటపట్టించాడు. అతని బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదేసి... కార్టెల్ వైపు చూసి నవ్వుతూ సెల్యూట్ చేశాడు.

కార్టెల్ ఎప్పుడు వికెట్లు తీసినా ఇలాగే సెల్యూట్ చేసేవాడు. దీనిని అనుసరిస్తూ బట్లర్ కూడా అదే విధంగా చేయడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.

ఈ మ్యాచ్‌‌లో వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన  విండీస్ సైతం గట్టి పోటీ నిచ్చింది.. 48 ఓవర్లలో 389 పరుగులకు అలౌటైంది. క్రిస్‌గేల్ 97 బంతుల్లో 162 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు.