హైదరాబాద్ మ్యాచ్ ద్వారా వన్డే సీరిస్‌ను గెలుపుతో ఆరంభించిన టీమిండియా ఆటగాళ్లు మంచి ఆత్మవిశ్వాసంతో నాగ్ పూర్ వన్డేకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే నాగ్ పూర్ కు చేరుకున్న టీమిండియా ఆటడగాళ్లు మంగళవారం జరిగే మ్యాచ్ కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎక్కువ సమయాన్ని మైదానంలోనే గడపుతూ ముమ్మర ప్రాక్టీస్ లో మునిగిపోయారు.  ఈ సదర్భంగా  కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిల మధ్య సరదా సంఘటన చోటుచేసుకుంది. 

మైదానంలో ధోని, రాహుల్, కోహ్లీ లు సరదాగా ఏదో సంభాషిస్తూ కనిపించారు. ఈ సమయంలో కోహ్లీ డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా కోహ్లీ, ధోని మధ్య నవ్వులు విరబూసాయి. ఈ వీడియో భారత అభిమానులను  ఆకట్టుకోవడంతో వైరల్ గా మారింది. ఆ వీడియోను కింద చూడండి. 

వీడియో