భారత్-ఆస్ట్రేలియా మధ్య మొహాలి వేదికగా జరిగిన వన్డేలో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత బ్యాట్ మెన్స్ అద్భుతంగా రాణించి 358 పరుగులు చేసినప్పటికి ఆ  పరుగులను కాపాడుుకోలేక పరాజయంపాలవ్వాల్సి వచ్చింది. ఇలా భారీ పరుగులన కాపాడుకోలేకపోవడంతో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ధోని స్థానంలో వికెట్ కీపింగ్ చేసిని యువ ఆటగాడు రిషబ్ పంత్ ను అభిమానులో ఓ ఆట ఆడుకుంటున్నారు. అతడే ఈ మ్యాచ్ ఓటమికి కారణమని...ధోనిని అనుసరించాలని ప్రయత్నించి విఫలమై జట్టు ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విమర్శలపై తాజాగా మొహాలీ సెంచరీ వీరుడు, భారత ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. రిషబ్ పంత్ వల్లే ఓడిన మాట నిజమే అయినా... అతడికి మరిన్ని అవకావాలివ్వాలని సూచించారు. ఎంత ఎక్కువ మ్యాచులాడితే అతడిలో అంత అనుభవం పెరుగుతుందని...అప్పుడే అతడిపై ఒత్తిడి తగ్గి స్వేచ్చగా ఆడగలడని ధావన్ పేర్కొన్నారు. 

రిషబ్ పంత్ ఇంకా కుర్రాడు.  అలాంటి అతడిని సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్ మెన్ మహేంద్ర సింగ్ తో పోల్చడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యాడన్నారు. దాని వల్లే మొహాలీ వన్డేలో కొన్ని పొరపాట్లు చేశాడని అన్నారు. అతడు ఆ స్టంపింగ్ లు మిస్ చేయకుండా వుంటూ మొహాలి ఫలితం మరోలా వుండేదన్నారు. 

పంత్ తనను తాను నిరూపించుకునేందుకు మరింత సమయం అవసరమని ధావన్ తెలిపారు. అప్పటివరకు అతడికి అవకాశాలివ్వాలని సూచించారు. అతడింకా నిలదొక్కుకునే ప్రయత్నంలో వుండగానే ఇలా విమర్శలతో బయపెట్టకూడదంటూ అభిమానులకు సూచించారు. అతడిలోని అత్యుత్తమ ఆటగాడికి మరింత సమయం ఇవ్వాలని ధావన్ అన్నారు.