మహేంద్ర సింగ్ ధోని... క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ధనాధన్ ఇన్నింగ్సులకు, హెలికాప్టర్ షాట్లకు అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక కీఫర్ గా అతడిని మించిన వారు లేదనడంలో అతిశయోక్తి లేదేమో. ఇక అతడు టీమిండియా కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించి ఎన్నో విజయాలను అందించి కెప్టెన్ కూల్ గా పేరుతెచ్చుకున్నాడు. ఇలా క్రికెట్ లోకాన్ని తన అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు ఓ బాలీవుడ్ సెక్సీ భామకు మాత్రం మరోలా నచ్చాడట. 

ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ సన్ని లియోన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి మీ ఇష్టమైన క్రికెటర్ ఎవరని అడగ్గా సన్నీ ఠక్కున మహేంద్ర సింగ్ ధోని అంటూ సమాధానమిచ్చారు. అయితే క్రికెటర్ గానే కాకుండా ప్యామిలీకి ఎక్కువగా సమయాన్ని కేటాయించే వ్యక్తిగా అతడంటే తనకెంతో ఇష్టమని సన్నీ లియోన్ వెల్లడించారు. 

క్రికెటర్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ ఎప్పుడూ బిజీగా వుండే అతడు విశ్రాంతి సమయాల్లో మాత్రం పూర్తిగా కుటుంబంతోనే గడుపుతాడని...ఈ లక్షణమే తనకెంతో నచ్చిందన్నారు. కూతురు జీవాతో అతడు ఎక్కువగా గడపడానికి చూస్తుంటాడని... వారిద్దరి ఫోటోలు చాలా బావుంటాయన్నారు. భార్య సాక్షిని చాలా ప్రేమగా చూసుకుంటాడన్నారు. ఇలా కుటుంబాన్ని ప్రేమించేవారంటే తనకెంతో ఇష్టమని సన్నీ లియోన్  తెలిపారు.