Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ వదులుకోడానికి సిద్దమే...కానీ అందుకు ఒప్పుకోలేము: బిసిసిఐ హెచ్చరిక

తాము నిర్వహించే మెగా టోర్నీలకు భారత ప్రభుత్వం నుండి పన్ను మినహాయింపు లభించేలా చూడాలని ఇటీవల ఐసిసి(ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్)  బిసిసిఐని కోరిన విషయం తెలిసిందే. లేకుంటే ఆ పన్నుల మొత్తాన్ని బిసిసిఐ చెల్లించాల్సి వుంటుందని సూచించింది. అయితే ఐసిసి నిర్ణయాన్ని బిసిసిఐ వ్యతిరేకిస్తోంది. తాము అదనపు పన్నులు చెల్లించడం కుదరదని...కావాలంటే భవిష్యతో భారత్ లో నిర్వహించాలనుకుంటున్న ఐసిసి టోర్నీలను ఇతర దేశాలకు  తరలించుకోవచ్చని బిసిసిఐ తేల్చి చెప్పింది.

bcci warning to icc about tax exception
Author
Mumbai, First Published Mar 6, 2019, 10:54 AM IST

తాము నిర్వహించే మెగా టోర్నీలకు భారత ప్రభుత్వం నుండి పన్ను మినహాయింపు లభించేలా చూడాలని ఇటీవల ఐసిసి(ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్)  బిసిసిఐని కోరిన విషయం తెలిసిందే. లేకుంటే ఆ పన్నుల మొత్తాన్ని బిసిసిఐ చెల్లించాల్సి వుంటుందని సూచించింది. అయితే ఐసిసి నిర్ణయాన్ని బిసిసిఐ వ్యతిరేకిస్తోంది. తాము అదనపు పన్నులు చెల్లించడం కుదరదని...కావాలంటే భవిష్యతో భారత్ లో నిర్వహించాలనుకుంటున్న ఐసిసి టోర్నీలను ఇతర దేశాలకు  తరలించుకోవచ్చని బిసిసిఐ తేల్చి చెప్పింది.

ఐసిసి ఇప్పటికే రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం 2021లో టీ20 ప్రపంచకప్‌ కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. అంతేకాకుండా 2023 లో వన్డే ప్రపంచకప్‌ కూడా భారత్‌ లోనే నిర్వహించనున్నారు. అయితే ఐసిసి మెగా ఈవెంట్లు నిర్వహించినప్పుడు సభ్యదేశాల నుంచి పన్ను మినహాయింపు లభిస్తుండగా భారత్ లో మాత్రం అలా జరగడం లేదు. గతంలో 2016 లో జరిగిన టీ20 ప్రపంచ కప్ కు భారత ప్రభుత్వం పన్నులను వసూలు చేయడంతో ఐసిసిపై దాదాపు  రూ.160 కోట్ల రూపాయల భారం పడింది. ఈ విషయంలో ఐసిసి, బిసిసిఐ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. 

దీంతో ముందుగానే అప్రమత్తమైన ఐసిసి భవిష్యత్ లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఐసిసి ఈవెంట్లకు పన్ను మినహాయింపు పొందాలని తెలిపింది. లేదంటే ఆ మొత్తాన్ని బిసిసిఐ భరించాలని  త్రైమాసిక సమావేశం సందర్భంగా ఐసిసి ఛైర్మన్‌ శశాంక్‌ స్పష్టం చేశారు. 

భారత్ అతిథ్యమివ్వనున్న టీ20. వన్డే ప్రపంచ కప్ టోర్నీలను స్టార్ నెట్ వర్క్ ప్రసారం చేయనుంది. ఈ సంస్థ వద్ద పూర్తి స్థాయిలో ప్రసారాలకు అవసరమయ్యే యంత్రాలు, యంత్రాంగం వుంది కాబట్టి ఇంకా మినహాయింపు ఎందుకని బీసీసీఐ ప్రశ్నిస్తోంది. పన్ను మినహాయింపే కావాలనుకుని ఈవెంట్లను భారత్‌లో కాకుండా మరో దేశంలో నిర్వహించుకోవాలని ఐసీసీ భావిస్తే అలాగే చేయవచ్చని...అందుకు తాము ఎలాంటి అభ్యంతరం చెప్పమని బిసిసిఐ అధికారులు చెబుతున్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios