బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యుడు, స్పిన్నర్ ముషారఫ్ హుస్సేన్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ముషారఫే వెల్లడించాడు. తన ఆరోగ్యం బాలేదని ముషారఫ్ ఢాకాలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు.

అక్కడి వైద్యుల బృందం అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఇది ప్రారంభదశలోనే ఉండటంతో సింగపూర్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకుంటే నయమవుతుందని సూచించారు.

తనకు వచ్చిన వ్యాధిపై ముషారఫ్ మాట్లాడుతూ... ‘‘ నాకు సర్జరీ అవసరం, దీని కోసం సింగపూర్ వెళ్తున్నాను. ప్రస్తుతం వీసాకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే సింగపూర్‌కి వెళ్లి సర్జరీ చేయించుకుంటాను.

తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తెలియగానే తాను, తన కుటుంబం కృంగిపోయామన్నాడు. అయితే ఇది ప్రారంభదశలో ఉందని ఉందని తెలియగానే మనసు కాస్త కుదుటపడింది.

నా ఆరోగ్య పరిస్థితి గురించి బంగ్లా క్రికెట్ బోర్డుకు చెప్పానని.. అందరూ తనను ఆందోళన చెందొద్దని చెప్పినట్లు తెలిపాడు. బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరుపున ఐదు వన్డేలు ఆడిన ముషారఫ్ 25 పరుగులు చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీశాడు. అలాగే 112 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 3000కు పైగా పరుగులు, 392 వికెట్లు పడగొట్టాడు.