Asianet News TeluguAsianet News Telugu

మొహాలిలో ఘన విజయం: ఆసిస్ ఆల్ టైమ్ రికార్డు

భారత్-ఆస్ట్రేలియా ల మధ్య  జరుగుతున్న వన్డే సీరిస్ మొహాలీ మ్యాచ్ తర్వాత రసవత్తంగా మారింది. ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ సునాయాసంగా చేధించింది. దీంతో ఘన విజయాన్ని సాధించడమే కాదు ఆసిస్ వన్డే క్రికెట్ చరిత్రతో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.  
 

australian team record chasing in odi
Author
Mohali, First Published Mar 11, 2019, 3:48 PM IST

భారత్-ఆస్ట్రేలియా ల మధ్య  జరుగుతున్న వన్డే సీరిస్ మొహాలీ మ్యాచ్ తర్వాత రసవత్తంగా మారింది. ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ సునాయాసంగా చేధించింది. దీంతో ఘన విజయాన్ని సాధించడమే కాదు ఆసిస్ వన్డే క్రికెట్ చరిత్రతో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.  

ఆస్ట్రేలియా జట్టు 359 పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఇదే తొలిసారి. 2011 లో స్వదేశంలో ఇంగ్లాడ్ తో జరిగిన వన్డేలో ఆసిస్ 334 పరుగులను చేజ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇలా మొహాలి వన్డేలో అంతకంటే ఎక్కువ పరుగులను చేజ్ చేసి విజయం సాధించింది. దీంతో ఆసిస్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ చేజింగ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

మొత్తంగా మొహాలీ వన్డే  విజయం ద్వారా ఇరు జట్లు 2-2 తో సమంగా నిలిచాయి. దీంతో సీరిస్ విజయాన్ని ఐదో వన్డే నిర్ణయించనుంది. దీంతో ఇరు జట్లకు చివరి వన్డేలో విజయం సాధించడం ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకోసం భారత్, ఆసిస్ లు ముందస్తు వ్యూహాలను రచిస్తున్నాయి. 

మొహాలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఓపెర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. శిఖర్ ధావన్ సెంచరీతో అదనగొట్టగా....రోహిత్ కొద్ది పరుగుల తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. వీరిద్దరి విజృంబనతో భారత్ స్కోరు ఏకంగా 358 పరుగులకే చేరింది. అయితే భారత్ తమ ముందు ఉంచిన 359 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. హ్యాండ్స్ కోబ్ సెంచరీతో అదరగొట్టగా, చివరలో టర్నర్ మ్యాచు ఫలితాన్నే టర్న్ చేశాడు. అతను ఆరు సిక్స్ లు ఐదు ఫోర్లతో 43 బంతుల్లో 84 పరుగులుచేసి అజేయంగా నిలిచి ఆసిస్ కు మరపురాని విజయాన్ని అందించాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios