Asianet News TeluguAsianet News Telugu

అతడు ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరితరం కాదు: ఆస్ట్రేలియా కోచ్

పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్‌కు కోచ్ జస్టిన్ లాంగర్ మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టు పగ్గాలు చేపట్టడం మొదలు ఇప్పటివరకు పించ్ అడపదడపా తప్ప ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సందర్భాలు లేవు. దీంతో అతడిని జట్టులోంచి పక్కనపెట్టాలని, పరిమిత ఓవర్ల మ్యాచుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని అభిమానులతో పాటు పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫించ్ లాంగర్ మద్దతుగా మాట్లాడటం ప్రధాన్యతను సంతరించుకుంది.
 
australia coach Langer Backs Out of Form Skipper Finch to Come Good
Author
Hyderabad, First Published Mar 1, 2019, 2:01 PM IST

పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ పించ్‌కు కోచ్ జస్టిన్ లాంగర్ మద్దతుగా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టు పగ్గాలు చేపట్టడం మొదలు ఇప్పటివరకు పించ్ అడపదడపా తప్ప ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సందర్భాలు లేవు. దీంతో అతడిని జట్టులోంచి పక్కనపెట్టాలని, పరిమిత ఓవర్ల మ్యాచుల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని అభిమానులతో పాటు పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫించ్ లాంగర్ మద్దతుగా మాట్లాడటం ప్రధాన్యతను సంతరించుకుంది.

ఫించ్ గురించి లాంగర్ మాట్లాడుతూ...'' అతడొక అత్యుత్తమైన ఆటగాడు. విద్వంసకర బ్యాటింగ్ లో అతడు స్పెషలిస్ట్ అని అందరికి  తెలుసు. ఇలా ఆస్ట్రేలియా జట్టులో అతడెంతో విలువైన ఆటగాడైనప్పటికి ప్రస్తుతం ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. తన కెరీర్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న  అతడికి మనమంతా మద్దతుగా నిలవాల్సి వుంది. 

అయితే కెప్టెన్ గా మాత్రం అతడు జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.  ఈ విషయంతో అతన్ని ప్రశంసించాల్సిందే. జట్టు సభ్యులంతా కలిసికట్టుగా వుండేలా అతడు జాగ్రత్త పడుతున్నాడు...అందువల్లే మంచి ఫలితాలు వస్తున్నాయి. ఫించ్ లాంటి మంచి కెప్టెన్ ఫామ్ లోకి వచ్చి అతన్ని ఆపడం ఎవరి తరం కాదు'' అని లాంగర్ ప్రశంసించారు.  

ఇక బెంగళూరు టీ20లో సెంచరీతో చెలరేగి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర వహించిన మ్యాక్స్ వెల్ ని కూడా లాంగర్ ప్రశంసించారు. అతడి ఆటతీరులో చాలా మార్పు వచ్చిందని....ఈ మద్యకాలంలో నిలకడగా ఆడుతూ  మంచి ఇన్నింగ్స్ నెలకొల్పుతున్నాడని  లాంగర్ తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios