ధోని ఫినిషింగ్ మాత్రమే బావుంది... బ్యాటింగ్ మొత్తం కాదు: వివిఎస్ లక్ష్మణ్ సెటైర్లు
మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా మాజీల విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అతడి స్లో బ్యాటింగ్ పై మాస్టర్ మాస్టర్ బ్లాస్టర్ అసహనం వ్యక్తం చేయగా తాజాగా మరో వివిఎస్ లక్ష్మణ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో ధోని పినిషింగ్ మాత్రమే అదిరిందని... ఆసాంత అతడి బ్యాటింగ్ నత్తనడకనే సాగి విసుగు తెప్పించిందని లక్ష్మణ్ పేర్కొన్నాడు.

''ధోని చివరి ఓవర్లో 16 పరుగులకు పిండుకోవడం...సిక్సర్ తో మ్యాచ్ ముగించడం బాగానే వుంది. అయితే ఇదే జోరును అతడు ఆరంభం నుండి కొనసాగిస్తే బావుండేది. నిదానంగా బ్యాటింగ్ ఆరంభించిన అతడు ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోడంలో విఫలమయ్యాడు. చివరి ఓవర్ కు ముందువరకు అతడి స్ట్రైక్ రేట్ 50కి మించలేదు. కనీసం సింగిల్స్ తీయడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. ధనాధన్ బ్యాట్ మెన్ గా పేరుతెచ్చుకున్న ధోని నుండి ఇలాంటి ఇన్నింగ్స్ ను అభిమానులే కాదు మేము కూడా ఊహించలేము'' అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.
అయితే మొత్తంగా ధోని చివరివరకు నాటౌట్ గా నిలిచి సాధించిన 56 పరుగులు జట్టుకెంతో ఉపయయోగపడ్డాయని తెలిపాడు. అప్ఘానిస్థాన్ తో మ్యాచ్ లోనూ ధోని బ్యాటింగ్ ఇలాగే నత్తనడకన సాగిందని లక్ష్మణ్ గుర్తుచేశాడు. అదృష్టవశాత్తు ఈ రెండు మ్యాచుల్లో టీమిండియా గెలిచింది...లేకపోతే ధోని ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చేవన్నాడు. పాండ్యా ఆత్మవిశ్వాసంతో ఆడుతూ వేగంగా పరుగులు సాధిస్తున్నాడని...అతడిలా ధోని ఆరంభంనుండి పరుగులు సాధించలేకపోతున్నాడని లక్ష్మణ్ పేర్కొన్నాడు.