Asianet News TeluguAsianet News Telugu

బుమ్రాకు అసలు జాలే లేదు...23 రోజుల్లోనే ఇంత మార్పా: సెహ్వాగ్ సెటైర్

సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి ప్రపంచ కప్ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. మరీ  ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో మొదటి వికెట్ పడగొట్టి భారత జట్టుకు బుమ్రా శుభారంభాన్ని అందించాడు. మొదట ఆమ్లాను ఆ వెంటనే డికాక్ ను పెవిలియన్ కు పంపించిన బుమ్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

world cup 2019: veteran team india player sehwag praises bumrah
Author
Southampton, First Published Jun 5, 2019, 5:35 PM IST

సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి ప్రపంచ కప్ మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. మరీ  ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో మొదటి వికెట్ పడగొట్టి భారత జట్టుకు బుమ్రా శుభారంభాన్ని అందించాడు. మొదట ఆమ్లాను ఆ వెంటనే డికాక్ ను పెవిలియన్ కు పంపించిన బుమ్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో బుమ్రాను పొగిడాడు. ట్విట్టర్ ద్వారా కాస్త వెరైటీగా బుుమ్రా సక్సెస్ ఫుల్ స్పెల్ గురించి స్పందించాడు. 
''వాట్ ఎ స్పెల్...  23 రోజుల క్రితం  బుమ్రాకు డికాక్ అంటే జాలి, ప్రత్యేకమైన అభిమానం వుండేది. కానీ ఇవాళ ఆ జాలి,దయ కనిపించలేవు''  అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. అంటే ఐపిఎల్ సమయంలో వీరిద్దరు (బుమ్రా, డికాక్) ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడారు.  కాబట్టి  వారి మధ్య మంచి సాన్నిహిత్యం వుండేది. కానీ 23 రోజుల క్రితం ముగిసిన ఐపిఎల్ తోనే వారి బంధానికి తెరపడిందని...ఇప్పుడు డికాక్ ప్రత్యర్థి జట్టు సభ్యుడు కావడంతో బుమ్రా అతడిపై ఏమాత్రం జాలి చూపించలేదన్నది సెహ్వాగ్ ట్వీట్ సారాంశం.

అంతకు ముందు ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తరపున  మొదటి వికెట్ పడగొట్టినందుకు సెహ్వాగ్ బుమ్రాను అభినందించాడు. '' 11/1. కంగ్రాట్స్ బుమ్ బుమ్ బుమ్రా. అద్భుతమైన లైన్ ఆండ్ లెంగ్త్ తో ప్రపంచ కప్ లో భారత జట్టుకు మొదటి వికెట్  సాధించిపెట్టావు'' అంటూ సెహ్వాగ్ అభినందించాడు. 

ప్రస్తుతం టీమిండియా బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ సఫారీ జట్టును దెబ్బతీశారు. బుమ్రాతో పాటు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ లు చక్కగా బౌలింగ్ చేయడంతో దాదాపు దక్షిణాఫ్రికా  టాప్  ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 89 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios