ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలోనే అత్యంత ఉత్కంఠ పోరు ఈ ఆదివారం( జూలై 16న) జరగనుంది. దాయాది దేశాలైన  భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే  ఈ మ్యాచ్ ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేటయ్యింది. దీంతో ఇరు దేశాల్లోని క్రికెట్ ప్రియులే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తమ జట్టు గెలుపుకోసం పాక్ మాజీ పేసర్ వకార్ యూనిస్ మేనేజ్ మెంట్ కు కొన్ని సలహాలు సూచనలు చేశాడు. 

ముఖ్యంగా ప్రపంచ కప్ జట్లన్నంటికంటే దుర్బేద్యమైన బ్యాటింగ్ లైనప్ ని కలిగివున్న టీమిండియాను ఎదుర్కోవాలంటే ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. అందులో  స్పెషలిస్ట్ స్పిన్నర్ తప్పనిసరిగా వుండేలా చూడాలన్నాడు. లేదంటే మిడిల్ ఓవర్లలో భారత్ బ్యాట్ మెన్స్ ని కట్టడి చేయలేక భారీ పరుగులు  సమర్పించుకోవాల్సి వస్తుందన్నాడు. 

అయితే పార్ట్ టైమ్ బౌలర్లతో ఈ పని చేయించవచ్చని భావిస్తే పాక్ కష్టాలను కొనితెచ్చుకున్నట్లేనని అన్నాడు. వారు బౌలింగ్ మాత్రమే చేయగలరు...స్పెషలిస్ట్ స్పిన్నర్ల మాదిరిగా ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టలేరని పేర్కొన్నాడు. కాబట్టి సీనియర్లు హఫీజ్, షోయబ్ మాలిక్ వంటి పార్ట్ టైమ్ బౌలర్లచేత మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేయించవచ్చన ఆలోచన వుంటే దాన్ని విమమించుకోవాలని  సూచించాడు. మాలిక్ ను పక్కనపెట్టి అతడి స్థానంలో షాదాన్ ఖాన్ ను జట్టులోకి తీసుకువాలని వకార్ సూచించాడు. 

గత కొంత కాలంగా బ్యాటింగ్ లో విఫలమవుతూ పాక్ జట్టుకు మాలిక్ భారంగా మారాడని వకార్ పేర్కొన్నాడు. అతడిని పాక్ మేనేజ్ మెంట్ ఇంకా ఎందుకు ఆడిస్తుందో తనకు అర్థం కావడం లేదని... అతడి స్థానంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ ను తీసుకుంటే పాక్ అద్భుతాలు చేయవచ్చని వకార్ పేర్కొన్నాడు.