భారత్- పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో అభిమానులు ఆతృతగా  ఎదురుచూస్తున్నది ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ కోసం. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలనే కాదు పాక్ అవకాశాలను కూడా ప్రభావితం చేయనుంది. అంతేకాకుండా ఈ ప్రపంచ కప్ లో టీమిండియా సత్తా ఏమిటో ఈ మ్యాచ్ ద్వారా తేలనుంది. దీంతో మూడు దేశాలను చెందిన అభిమానులు ఈ మ్యాచ్ పై ఆసక్తిని కనబరుస్తున్నారు. కేవలం అభిమానులే కాదు ఈ మూడు దేశాలను చెందిన మాజీలు, క్రీడా విశ్లేషకులు కూడా ఈ మ్యాచ్ పై ఇప్పటికే చర్చించుకోవడం ఆరంభించారు. 

ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుస్సెన్, ఫీటర్సన్ ల మధ్య ఆసక్తికరమైన చర్చచ జరిగింది. భారత సంతతికి చెందిన నాసిర్, దక్షిణాఫ్రికా సంతతికి చెందిన ఫీటర్సన్ ఇద్దరి మధ్య ట్విట్టర్ ద్వారా ఆసక్తికరమైన చర్చ  జరింగింది. 

మొదట నాసిర్ పాక్ అభిమానులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. '' పాకిస్థాన్ క్రికెట్ ప్రియులవదరికీ ఓ ప్రశ్న. ఆదివారం జరగనున్న ఇంగ్లాండ్ VS పాకిస్థాన్ మ్యాచ్ లో మీ మద్దతు ఎవరికి? ''  అంటూ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఫీటర్సన్ ''ముందు నీ మద్దతెవరికో చెప్పు నాస్'' అంటూ ఎదురు ప్రశ్న వేశాడు.

దీనికి నాసిర్ తెలివిగా సమాధానమిచ్చాడు. '' తప్పకుడా నా మద్దతు ఇంగ్లాండ్ కే. సౌతాఫ్రికా తో రగ్బీ మ్యాచ్ ఆడే సమయంలో నీవు ఇంగ్లాండ్ కే సపోర్ట్ చేస్తావు చూడూ...అలాగే'' అంటూ సమాధానమిచ్చాడు. అంటే నువ్వు నీ పూర్వీకుల దేశమైన సౌతాఫ్రికాకు కాకుండా ఇంగ్లాండ్ కు మద్దతు ఎలా ఇస్తావో నేను కూడా ఇండియాకు కాకుండా ఇంగ్లాండ్ కు అలాగే మద్దతిస్తానంటూ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు.