ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు వెస్టిండిస్ మ్యాచ్ మరో కఠిన సవాల్ ఎదురవనుంది. తనదైన రోజున హార్డ్ హిట్టింగ్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సత్తా వున్న బ్యాట్ మెన్లకు ఆ జట్టులో  కొదవలేదు. దీంతో వారిని టీమిండియా బౌలర్లు ఎలా ఎదుకర్కొంటారోనని అభిమానులనుల్లో  సందేహం నెలకొంది. అయితే అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని...విండీస్ హిట్టర్లను ఎదుర్కొడానికి టీమిండియా బౌలింగ్ లైనఫ్ సంసిద్దంగా వుందని యజువేందర్ చాహల్ పేర్కొన్నాడు. 

ఈ నెల 27న వెస్టిండిస్ జనగనున్న మ్యాచ్ కోసం ఇప్పటకే వ్యూహాలన్ని సిద్దం చేసినట్లు తెలిపాడు. ముఖ్యంగా ఆ జట్టులో ప్రతి ఆటగాడు హిట్టింగ్ పై  ఎక్కువగా దృష్టి పెడతారు కాబట్టి వారిని  పరుగులు రాబట్టకుండా అడ్డుకుంటూనే వికెట్లు పడగొట్టేలా తమ బౌలింగ్ సాగనుందన్నాడు. అలాగే మిడిల్ ఓవర్లలో వారి ఆట ఎలా కట్టించాలో తమకుమ తెలుసని చాహల్ పేర్కొన్నాడు. 

ప్రస్తుతం ఆ జట్టు వరుస ఓటములతో సతమతమవుతుంది. కాబట్టి మాపై ఎదురుదాడికి దిగి విజయం సాధించాలని వారు ప్రయత్నిస్తారు. అయితే వారి  స్టైల్లోనే ఎదురుదాడికి  దిగి తాము ఫలితాన్ని రాబడతాం. ఇలా వారు ఎలా ఆడితే మేమెలా బౌలింగ్ చేయాలో ముందుగానే ఓ ప్రణాళిక రూపొందించుకున్నట్లు...దాని ప్రకారమే మైదానంలో వారిపైప మా  బౌలింగ్ ఎటాక్ వుంటుందని తెలిపాడు. 

ముఖ్యంగా ఆండ్రీ రస్సెల్ వంటి హిట్టర్ ను ఎదుర్కోవడం చాలా కష్టం. అయితే అతడి బ్యాటింగ్ స్టైల్ పై తనకు మంచి  అవగాహన వుందని...ఐపిఎల్ లో ఆటను చాలా దగ్గరినుండి చూశామని అన్నాడు. కాబట్టి అతడే కాదు మిగతా బ్యాట్ మెన్స్ ఆటతీును బట్టి మా వ్యూహాలను అమలుపరుస్తామని చాహల్ వెల్లడించాడు.