మహేంద్ర సింగ్ ధోని  గొప్ప క్రికెటరే కాదు అంతకంటే గొప్ప దేశభక్తుడన్న విషయం  అందరికి తెలిసిందే.  ఇలా అతడు దేశంపై అభిమానంతో చేసిన ఓ పని తాజాగా తీవ్ర వివాదాస్పదమవుతోంది. ప్రపంచ కప్ టోర్నీలో అతడు భారత ఆర్మీ అమరవీరుల  గౌరవార్థం రూపొందించిన ''బలిదాన్'' లోగోతో కూడాన కీపింగ్ గ్లవ్స్ వాడాడు. అయితే ధోని వాడిన ఈ గ్లోవ్స్ అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలను ఉళ్లంఘించేలా వున్నాయంటూ ఐసిసి తప్పబట్టింది. అంతేకాకుండా వాటిని వాడకుండా ధోనిని నిలువరించాలంటూ బిసిసిఐకి ఆదేశాలు కూడా జారీ చేసింది. 

ఈ విషయంపై  ఐసిసి వ్యవహరిస్తున్న తీరుపై టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ తాజాగా స్పందించాడు. భారత  దేశీయంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రికెట్ ఈ స్థాయికి చేరుకోవడంలో ధోని పాత్ర మరువలేనిదని అన్నాడు. అలాంటి ఆటగాన్ని ఐసిసి అవమానించిందని అతడు మండిపడ్డాడు. వెంటనే తప్పును గుర్తించి ధోనికి, భారత ప్రజలకు ఐసిసి క్షమాపణలు చెప్పాలని  శ్రీశాంత్ డిమాండ్ చేశాడు. 

ధోనికి భారత ఆర్మీ అంటే చాలా గౌరవముందని... అందువల్లే బలిదాన్ లోగో కలిగిన  గ్రోవ్స్ వాడి వుంటారని తెలిపాడు. దీన్ని ఇంతపెద్ద వివాదం చేయడం తగదని అతడు ఐసిసి సూచించాడు. అలాగే ధోనికి తాను అండగా నిలబడుతున్నాని... దేశ గౌరవం అంతర్జాతీయంగా కాపాడబడాలంటే భారతీయులంతా అతడికి అండగా నిలవాలని శ్రీశాంత్ పిలుపునిచ్చాడు.

ధోని బలిదాన్ లోగో కలిగిన గ్లోవ్స్ వాడకూడదంటూ బిసిసిఐకి ఐసిసి లేఖ రాసినట్లు తెలిపాడు. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుని ధోనికి క్షమాపణలు చెబుతూ మరో లేఖ రాసేవరకు భారత ప్రజలు వెనక్కి తగ్గకూడదని శ్రీశాంత్ సూచించారు.