ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో అదగొట్టి సెమీస్ కు దూసుకెళ్లింది. ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లను  వెనక్కినెట్టి పాయింట్స్ టేబుల్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఇలా భారత జట్టును సెమీస్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది ఓపెనర్ రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఇంగ్లాండ్ లోని స్లో పిచ్ లపై రోహిత్ ఇంత సునాయాసంగా సెంచరీలు ఎలా బాదగలుగుతున్నాడా అని అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే రోహిత్ వరుస సెంచరీల వెనకున్న రహస్యాన్ని తాజాగా మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ బయటపెట్టాడు. 

సౌతాంప్టన్, బర్మింగ్ హామ్, మాంచెస్టర్ ఈ మూడు మైదానాల్లో పిచ్ లు చాలా స్లోగా వున్నాయని రాహుల్ తెలిపాడు. ఇలాంటి పిచ్ లపైప ముందునుండే భారీ షాట్లకు ప్రయత్నించకుండా కుదురుకోడానికి ప్రయత్నించాలి. ఒక్కసారి  పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుంటే ఇక వెనక్కితిరిగా చూసుకోవాల్సి వుండదు. రోహిత్ శర్మ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. అందువల్లే అతడు వరుస సెంచరీలతో అదరగొట్టి ఈ టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడని వెల్లడించాడు. 

సహజంగానే రోహిత్ మంచి హిట్టర్ కాబట్టి అతడు వేంగంగా ఆడటానికి ప్రయత్నిస్తాడు. అందువవల్లే అతడికి సహకరించాలనే తాను నెమ్మదిగా ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేయాల్సి వస్తోందన్నాడు. అంతేకానీ తన బ్యాటింగ్ లో ఎలాంటి  మార్పులు చోటుచేసుకకోలేవని రాహుల్ వివరించాడు. 

ఇక బంగ్లాదేశ్ పై సాధించిన 180 పరుగుల భాగస్వామ్యాన్ని తానెప్పటికి మరిచిపోలేనని రాహుల్ తెలిపాడు. రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేయడం చాలా సంతోషకరమని... ఈ జర్నీలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని పేర్కొన్నాడు. ఈ ప్రపంచ కప్ లో తాను సాగిస్తున్న ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని రాహుల్ వెల్లడించాడు.