Asianet News TeluguAsianet News Telugu

ఇండియా-ఇంగ్లాండ్ మధ్యే ఫైనల్...దేవుడు మా డ్రెస్సింగ్ రూంలోనే: రవిశాస్త్రి

టీమిండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రపంచ కప్ ఫైనల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా  డ్రెస్సింగ్ రూంలో దేవుడు దర్శనమిస్తాడని...ఆయన కరణతో టీమిండియా గెలవడం ఖామయని పేర్కొన్నారు. 

world cup 2019: team india chief coach ravi shastri comments on world cup final
Author
Manchester, First Published Jul 10, 2019, 2:09 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో అదరగొడుతున్న భారత జట్టుపై చీఫ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. మాంచెస్టర్ వేదికన జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం మొదటి ఫైనలిస్ట్  ఎవరో తేలాల్సి వుండగా వర్షం కారణంగా అది బుధవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి మాట్లాడుతూ...ఎట్టి పరిస్థితుల్లోనూ టీమిండియా ఫైనల్ కు చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా రవిశాస్త్రి  ఈ మెగాటోర్నీ లీగ్ దశలో టీమిండియా విజయపరంపరను గుర్తుచేశాడు. అయితే  ఎనిమిది మ్యాచుల్లో ఏడింటిని గెలిచిన భారత్ ఒక్క ఇంగ్లాండ్ చేతిలోనే ఓటమిని చవిచూసింది. ఇలా తాము ఆ మ్యాచ్ లో ఓడిపోవడం మంచిదే అయ్యిందని రవిశాస్త్రి పేర్కొన్నారు. 

'' లీగ్ దశలో భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఆ దేవుడు తమ పక్షాన నిలవలేదు. ఆయన ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూంలో తిష్టవేశాడు. ఆయన కరుణించడం వల్లే ఇంగ్లాండ్ మాపై విజయాన్ని సాధించింది.

అయితే న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్లో గెలిచి టీమిండియా ఫైనల్ కు చేరడం ఖాయం. ఒకవేళ సెకండ్ సెమీఫైనల్లో తలపడుతున్న  ఆస్ట్రేలియాను ఆతిథ్య ఇంగ్లాండ్ ఓడించగలిగితే ఫైనల్ కు చేరుకుంది. ఇలా లార్డ్స్ వేదికన జరిగే  ప్రపంచ కప్ ఫైనల్ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగితే అప్పుడు దేవుడు  టీమిండియా డ్రెస్సింగ్ రూంలో దర్శనమిస్తాడు. కాబట్టి తప్పకుండా ఫైనల్లో భారత జోరు కొనసాగి విజయం సాధిస్తుంది'' అని రవిశాస్త్రి పేర్కొన్నారు. దీంతో కోహ్లీసేన మూడోసారి ట్రోఫీని ముద్దాడటం ఖాయమని చీఫ్ కోచ్ జోస్యం చెప్పారు.   

 

Follow Us:
Download App:
  • android
  • ios