టీమిండియా రన్ మెషీన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో మేటి దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాల పేరిట వున్న రికార్డును ఈ ప్రపంచ కప్ టోర్నీలోనే బద్దలుగొట్టడం ఖాయంగా కరిపిస్తోంది. అయితే కోహ్లీ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఫామ్ ను అందిపుచ్చుకున్నాడు కాబట్టి రేపు (శనివారం) అప్ఘానిస్తాన్ తో జరిగే మ్యాచ్ ఈ రికార్డు బద్దలవడం ఖాయమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు కోహ్లీ కన్నేసిన ఆ రికార్డేంటో...  అందుకు అతడింక ఎన్ని పరుగుల దూరంలో వున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

విరాట్ కోహ్లీ... ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ క్రికెటర్ గా కీర్తించబడుతున్న మేటి క్రికెటర్. ఇప్పటికే అతడి పరుగుల దాహానికి ఎందరో దిగ్గజాల రికార్డులు బద్దలయ్యాయి. తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగుల మైలురాయిని చేరుకోడానికి అతడు సెంచరీ దూరంలో నిలిచాడు. అయితే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా కోహ్లీ నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. అప్ఘాన్ పై జరిగే మ్యాచ్ లోనే ఆ లాంఛనం పూర్తయినా ఆశ్చర్యపోనవరం లేదు. 

అంతర్జాతీయ క్రికెట్ లోని  అన్ని విభాగాల్లో  కలిపి అత్యంత వేగంగా 20 వేల పరుగులు సాధించిన రికార్డు సచిన్,లారా ల పేరిట సంయుక్తంగా వుంది. వీరిద్దరు 453  ఇన్నింగ్సుల్లో ఈ ఘనతను అంతుుకున్నారు. అయితే కోహ్లీ ఇప్పటివరకు కేవలం 415 ఇన్నింగ్సుల్లోనే 19,896 పరుగులు సాధించాడు. మరో 104 పరుగులు చేస్తే వారి పేరిట వున్ని రికార్డు కోహ్లీ ఖాతాలోకి చేరనుంది. 

ఉపఖండ దేశమైన పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 77 పరుగులు చేసి టచ్ లోకి రావడమే కాదు ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అత్యంత వేగంగా వన్డేల్లో 11వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే మరో ఉపకండ  దేశం  అప్ఘాన్ తో మ్యాచ్ లో 20 వేల మైలురాయిని అందుకుని మరో చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.