అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ బౌలర్ గా ఎదిగాడు జస్ప్రీత్ సింగ్ బుమ్రా. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో టీమిండియా బౌలింగ్ విబాగానికి సారథ్యం వహించే అరుదైన అవకాశాన్ని పొందాడు. ఇలా బుమ్రాను టాప్ బౌలర్ గా నిలబెట్టింది అతడి పదునైన యార్కర్కేనని పేర్కొనడంలో అతిశయోక్తి లేదు.  అభిమానులు ముద్దుగా యార్కర్ స్పెషలిస్ట్ అని బుమ్రాను పిలుచుకుంటారంటేనే అతడి బౌలింగ్ లో వాటి ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. ఇలా  ప్రపంచ కప్ టోర్నీలోనూ అతడి యార్కర్ల ధాటికి ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా తాను ఖచ్చితమైన యార్కర్లు విసరడం వెనుక వున్న రహస్యాన్ని తాజాగా బుమ్రా బయటపెట్టాడు. 

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడాడు. '' ఖచ్చితమైన యార్కర్లు విసరడంలో నన్ను స్పెషలిస్ట్ గా మార్చింది నెట్ ప్రాక్టీసే. నేను నెట్స్ లో కూడా సీరియన్ గా బౌలింగ్ చేస్తా.  మ్యాచ్ జరుగుతున్నపుడు ఎలాగయితే బౌలింగ్ చేస్తానో నెట్స్ లో కూడా అలాగే చేస్తా. అయితే నెట్స్ లో మాత్రం ఎక్కువగా యార్కర్లను ప్రాక్టీస్ చేస్తాను. 

అందువల్లే నా యార్కర్ల పదును రోజురోజుకు పెరుగుతోందని భావిస్తున్నా. అయితే నేనింకా యార్కర్లు   విసరడంలో మాస్టర్ చేయాల్సి వుందని...ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారానే అది సాద్యపడుతుంది(నవ్వుతూ). యార్కర్ల  పదును పెరగడానికి వేరే  మార్గమేమీ లేదని... నిరంతరం ప్రాక్టీస్ చేయడం  ఒక్కటే మార్గం. అదే నేను చేస్తూ ఫలితాన్ని రాబడుతున్నాను.'' అని బుమ్రా వెల్లడించాడు. 

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ కీలక సమయంలో బుమ్రా  యార్కర్లే మ్యాచ్ ను మలుపుతిప్పాయి. అతడు ఈ  మ్యాచ్ లో నాలుగు వికెట్లు (మొసాదిక్‌, షబ్బీర్‌, రుబెల్‌, ముస్తాఫిజుర్‌)లను ఔట్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. దీంతో  బుమ్రా బౌలింగ్ ముఖ్యంగా యార్కర్ల ప్రశంసలు కురుస్తున్నాయి.