ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా ఓ  చెత్త రికార్డును నెలకొల్పింది. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత టాప్ ఆర్డర్ ను కివీస్ బౌలర్లు బెంబేలెత్తించాడు. దీంతో మొదటి పది ఓవర్లలో కోహ్లీ సేన నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం  24  పరుగులు మాత్రమే చేసింది. ఇలా ఈ ప్రపంచ కప్ టోర్నీలో మొదటి పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు సాధించిన చెత్త రికార్డు టీమిండియా ఖాతాలో చేరింది. 

అంతకు ముందు ఈ చెత్త రికార్డు భారత్ పేరిటే వుండగా ఇదే మ్యాచ్ లో న్యూజిలాండ్ దాన్ని బద్దలుగొట్టింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా మొదటి  పవర్ ప్లే లో కేవలం 28 పరుగులే చేసింది. అయితే ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో మంగళవారం మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ కూడా చాలా నెమ్మదిగా ఆడింది. దీంతో మొదటి పది ఓవర్లలో ఆ జట్టు కేవలం 27 పరుగులు మాత్రమే చేయగలింది. ఇలా చెత్త రికార్డు నమోదుచేసినప్పటికి అది కేవలం ఒక్కరోజు మాత్రమే కివీస్ ఖాతాలో వుంది. తాజాగా టీమిండియా  అతకంటే తక్కువ పరుగులు చేసి మళ్ళీ తన చెత్త రికార్డును తానే కైవసం చేసుకుంది.  

మంగళవారం మొదలైన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా బుధవారానికి వాయిదా పడింది.  అయితే  వర్షం కారణంగా పిచ్ లో మార్పులు చోటుచేసుకుని బౌలింగ్ కు అనుకూలంగా మారింది. దీంతో రెచ్చిపోయిన హెన్రీ, బౌల్ట్ లు భారత టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. రోహిత్, కోహ్లీ, రాహుల్ లు కేవలం ఒక్కో పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత పంత్ 32, పాండ్యా 32, కార్తిక్ 6 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో భారత్ 30 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 92 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది.