Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్: శ్రీలంక, సౌతాఫ్రికా ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం... మైదానంలోనే

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో శ్రీలంక, సౌతాఫ్రికా  ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పింది. చెస్టర్‌లీ స్ట్రీట్‌ వేదికగా శ్రీలంక Vs సౌతాఫ్రికాల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ లో జరుగుతుండగా ఒక్కసారిగా మైదానంలోకి ప్రమాదకరమైన తేనెటీగల గుంపు ప్రవేశించింది. దీంతో మైదానంలోకి ఇరు దేశాల ఆటగాళ్లు కొద్దిసేపు ఆటను నిలిపివేసి తమను తాము రక్షించుకున్నారు. అయితే తేనెటీగల  గుంపు ఆటగాళ్లెవరినీ గాయపర్చకుండా వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

world cup 2019: Sri Lanka Vs South Africa temporarily suspended after bees attack
Author
Chester-le-Street, First Published Jun 28, 2019, 8:35 PM IST

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో శ్రీలంక, సౌతాఫ్రికా  ఆటగాళ్లకు పెను ప్రమాదం తప్పింది. చెస్టర్‌లీ స్ట్రీట్‌ వేదికగా శ్రీలంక Vs సౌతాఫ్రికాల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ లో జరుగుతుండగా ఒక్కసారిగా మైదానంలోకి ప్రమాదకరమైన తేనెటీగల గుంపు ప్రవేశించింది. దీంతో మైదానంలోకి ఇరు దేశాల ఆటగాళ్లు కొద్దిసేపు ఆటను నిలిపివేసి తమను తాము రక్షించుకున్నారు. అయితే తేనెటీగల  గుంపు ఆటగాళ్లెవరినీ గాయపర్చకుండా వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

శ్రీలంక  బ్యాటింగ్ మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సౌతాఫ్రికా బౌలర్ క్రిస్ మెర్రిస్ 48 ఓవర్ చివరి బంతిని వేయడానికి సిద్దమవుతుండగా ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానంలోకి ప్రవేశించింది. దీంతో క్రీజులో వున్న లంక బ్యాట్ మెన్స్, సౌతాఫ్రికా ఆటగాళ్లతో పాటు అంపైర్లిద్దరూ తేనెటీగల నుండి తప్పించుకోడానికి మైదానంలోనే పడుకుండిపోయారు. 

దీంతో అభిమానులకు మైదానంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అయితే కాస్సేపటి తర్వాత తేనేటీగల గుంపు అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇలా కొద్దిసేపు మ్యాచ్ కు అంతరాయం కలగ్గా అంతా సర్దుకోవడంతో వెంటనే మ్యాచ్‌ కొనసాగింది.  అయితే తేనెటీగల దాడిలో ఆటగాళ్లెవరికీ ఎలాంటి గాయాలు కాలేవని ఐసిసి ట్వీట్ చేసింది. ఆటగాళ్లు ఈ తేనెటీగల నుండి తప్పించుకోడానికి మైదానంలో పడుకున్న ఫోటోను కూడా ఐసిసి తమ అధికారిక ట్విట్టర్ లో పెట్టింది. 

Follow Us:
Download App:
  • android
  • ios