Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ ట్రోఫీ టీమిండియాదే... కానీ: జాక్వెస్ కలిస్

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో తుదివిజయం టీమిండియాదేనని సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌడర్ జాక్వెస్ కలిస్ జోస్యం చెప్పారు. తమ జట్టు(దక్షిణాఫ్రికా)పై భారత జట్టు ఆటతీరును బట్టే ఈ విషయం చెప్పవచ్చని అన్నారు. ఈ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టే అసలుసిసలైన పోటీదారని కలిస్ కొనియాడారు.

world cup 2019: south africa veteran  player kallis praises team india
Author
Hyderabad, First Published Jun 7, 2019, 4:39 PM IST

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో తుదివిజయం టీమిండియాదేనని సౌతాఫ్రికా మాజీ ఆల్ రౌడర్ జాక్వెస్ కలిస్ జోస్యం చెప్పారు. తమ జట్టు(దక్షిణాఫ్రికా)పై భారత జట్టు ఆటతీరును బట్టే ఈ విషయం చెప్పవచ్చని అన్నారు. ఈ ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టే అసలుసిసలైన పోటీదారని కలిస్ కొనియాడారు.

ఇంగ్లాండ్ పిచ్ లపై ప్రపంచ స్థాయి సీమర్లు కలిగిన కలిగిన సఫారీ జట్టు వరుస ఓటములను చవిచూడటం ఆశ్యర్యంగా వుందన్నారు. ఇదే ఆటతీరు కొనసాగితే లీగ్ దశనుండే నిష్క్రమించడం ఖాయమని అన్నారు. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయి సెమీస్ ఆశలను క్లిష్టం చేసుకున్న సౌతాఫ్రికా ఆటగాళ్లు ఇప్పటికైనా మేలుకోకుంటే ఇంటిదారి తప్పదన్నారు. 

 తమ జట్టు ఇంగ్లాండ్, టీమిండియాల చేతిలో ఓడిపోవడం పెద్ద ఆశ్యర్యాన్ని కల్గించలేదన్నారు. కానీ పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఓడటం చాలా బాధించిందని తెలిపారు. ఇంత ఫేలవ  ఆటతీరుతో అత్యుత్తమ జట్లను ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. 

దక్షిణాఫ్రికాపై టీమిండియా అన్ని విభాగాల్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించిందని కలిస్ గుర్తు చేశారు. మొదట బౌలింగ్, ఫీల్డింగ్ ఆ తర్వాత బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత జట్టు రాణించిందన్నారు. ఇదే ఊపు చివరివరకు కొనసాగితే వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదేనని కలిసి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios