Asianet News TeluguAsianet News Telugu

నేనే పాకిస్థాన్ టీం చీఫ్ కోచ్ అయితే: రోహిత్ శర్మ

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా దాయాది దేశాల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక పోరులో భారత్ ఘన విజయాన్ని సాధించింది. పాకిస్తాన్ జట్టుపై అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించిన టీమిండియా ఏకంగా 86 పరుగుల తేడాతో  పాక్ ను చిత్తుగా ఓడించింది. మాంచెస్టర్ లో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా మరోసారి సత్తా చాటి ప్రపంచ కప్ లో పాక్ పై ఏడో విజయాన్ని నమోదుచేసి చరిత్ర సృష్టించింది.

world cup 2019: rohit sharma funny answer to pak reporter
Author
Manchester, First Published Jun 17, 2019, 8:39 PM IST

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా దాయాది దేశాల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక పోరులో భారత్ ఘన విజయాన్ని సాధించింది. పాకిస్తాన్ జట్టుపై అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించిన టీమిండియా ఏకంగా 86 పరుగుల తేడాతో  పాక్ ను చిత్తుగా ఓడించింది. మాంచెస్టర్ లో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా మరోసారి సత్తా చాటి ప్రపంచ కప్ లో పాక్ పై ఏడో విజయాన్ని నమోదుచేసి చరిత్ర సృష్టించింది.

అయితే టీమిండియా విజయంలో రోహిత్  శర్మ అద్భుత సెంచరీ కీలక భూమిక పోషించింది. ఓ విధంగా భారత ఆటగాళ్లకు బూస్ట్ ఇచ్చి పాక్ ను ఒత్తిడిలోకి నెట్టింది ఈ సెంచరీయే. రోహిత్ కేవలం 113 బంతుల్లోనే 140 పరుగులతో చెలరేగండంతో టీమిండియా పాక్ ముందు 337 పరుగుల భారీ లక్ష్యాన్ని వుంచగలిగింది. దీంతో సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా వుండటంతో వేగంగా  ఆడటానికి ప్రయత్నించిన పాక్ బ్యాట్ మెన్స్ వెంటవెంటనే  వికెట్లు కోల్పోయారు. ఇలా భారత్ అద్భుత విజయాన్ని  అందుకోవడంలో రోహిత్  పాత్ర కీలకమైనది. 

అయితే ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ మీడియాతో మాట్లాడుతుండగా ఓ పాకిస్థానీ  జర్నలిస్ట్ ఓ ప్రశ్న అడిగాడు. మీరేగనుక పాక్  చీఫ్ కోచ్ అయితే ఆటగాళ్లకు ఎలాంటి శిక్షణనిచ్చి మెరుగ్గా తయారుచేస్తారు? అని అడిగాడు. అందుకు రోహిత్ కూడా సరదా సమాధానమిచ్చాడు. తనను పాక్  కోచ్ గా నియమిస్తే తప్పకుండా ఈ ప్రశ్నకు జవాబు చెబుతానని...కానీ ఇప్పుడు ఏం చెప్పలేనని సమాధానమిచ్చాడు. రోహిత్ ఇలా సరదా సమాధానంతో పాక్ జర్నలిస్ట్ తో పాటు మిగతా మీడియా సభ్యుల్లో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.  
 
Follow Us:
Download App:
  • android
  • ios